LSG vs Delhi: అదరగొట్టిన ఫృధ్వీషా.. లక్నో టార్గెట్‌ 150 పరుగులు

|

Apr 07, 2022 | 9:19 PM

LSG vs Delhi: టీ20 మెగా టోర్నీలో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో మొదటగా టాస్‌

LSG vs Delhi: అదరగొట్టిన ఫృధ్వీషా.. లక్నో టార్గెట్‌ 150 పరుగులు
Lsg Vs Delhi
Follow us on

LSG vs Delhi: టీ20 మెగా టోర్నీలో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో మొదటగా టాస్‌ గెలిచిన లక్నో ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్లుగా ఫృధ్వీషా, డేవిడ్‌ వార్నర్ బరిలోకి దిగారు. ఇందులో ఫృధ్వీషా ఆరంభం నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఓవర్లో ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదిన పృథ్వీ.. మూడో బంతికి కీపర్‌కి చిక్కి క్రీజు 61 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత త్వరత్వరగా రెండు వికెట్లు పడినా కెప్టెన్ రిషబ్‌ పంత్‌, సర్పరాజ్‌ అహ్మద్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. 15 ఓవర్లు దాటాక వేగంగా ఆడటం ప్రారంభించారు. కానీ లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. భారీ స్కోరు సాధిస్తుందని బావించిన ఢిల్లీ చివరకి 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ పంత్ 36 బంతుల్లో 39 ( 2 సిక్స్‌లు, 3 ఫోర్లు) పరుగులు, సర్పరాజ్‌ ఖాన్ 28 బంతుల్లో 36 (3 ఫోర్లు) పరుగులు చేసి పరువు నిలబెట్టుకున్నారు. లక్నో బౌలర్లలో రవి బిషోని 2 వికెట్లు, కృష్ణప్ప గౌతమ్‌కి ఒక వికెట్‌ దక్కింది.

Army Jobs: ఆర్మీ ఉద్యోగాలలో సరికొత్త మార్పులు.. ఐదేళ్లు, మూడేళ్లకే రిటైర్మెంట్..!

Banana Peel Benefits: అరటి తొక్కలో అద్భుత గుణాలు.. వీటిని అస్సలు కోల్పోకండి..!

Dairy Farming: పశుపోషణకి పెద్దపీట వేస్తున్న కేంద్రం.. ఈ పథకం కింద రైతులకి ప్రత్యేక సబ్సిడీ..!