Lionel Messi : కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల వీరంగం..22 నిమిషాల్లోనే వెనుదిరిగిన అర్జెంటీనా దిగ్గజం

Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత ఈ సూపర్ స్టార్ భారత్‌కు వచ్చారు. శనివారం ఉదయం ఆయన కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకోగానే అక్కడ అభిమానుల ఆనందోత్సాహాలు కట్టలు తెంచుకున్నాయి.

Lionel Messi : కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల వీరంగం..22 నిమిషాల్లోనే వెనుదిరిగిన అర్జెంటీనా దిగ్గజం
Lionel Messi (2)

Updated on: Dec 13, 2025 | 3:27 PM

Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత ఈ సూపర్ స్టార్ భారత్‌కు వచ్చారు. శనివారం ఉదయం ఆయన కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకోగానే అక్కడ అభిమానుల ఆనందోత్సాహాలు కట్టలు తెంచుకున్నాయి. మెస్సీతో పాటు ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సువారెజ్, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు దిగ్గజాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సమక్షంలో మెస్సీ తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు.

శనివారం ఉదయం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ కొద్దిసేపటి కోల్‌కతా పర్యటన అరాచకానికి దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఫుట్‌బాల్ ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయిన కోపంతో, నిరాశ చెందిన అభిమానులు భద్రతా నిబంధనలను ఉల్లంఘించారు. మైదానంలోకి దూసుకువచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో, ఈ గందరగోళం కారణంగా మెస్సీ కేవలం 22 నిమిషాలలోనే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

సిటీ ఆఫ్ జాయ్‎లో ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఒక మరుపురాని రోజుగా మిగలాలి.. కానీ ఇది ఒక పీడకలలా మారిపోయింది. మెస్సీ మైదానంలోకి అడుగు పెట్టగానే పరిస్థితి అదుపు తప్పింది. స్టేడియం లోపల ఏర్పడిన గందరగోళం కారణంగా ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు. దీని కారణంగా అక్కడ ఈ కార్యక్రమం కోసం హాజరైన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ దిగ్గజ ఆటగాడిని కలుసుకోలేకపోయారు.

పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే జీఓఏటీ టూర్ నిర్వాహకులలో ఒకరైన శతద్రు దత్తా, భద్రతా సిబ్బంది మెస్సీని స్టేడియం నుంచి సురక్షితంగా బయటకు తరలించాల్సి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఆటగాడిని చూడటానికి రూ.4,500 నుంచి రూ.10,000 వరకు టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారు సీట్లను ధ్వంసం చేశారు. నీళ్ల సీసాలు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..