ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్.. ఇక World Cup నుంచి తప్పించే దమ్ముందా అంటోన్న ఫ్యాన్స్

Virat Kohli - Rohit Sharma: ఈ ఒక్క రోజే భారత దేశవాళీ క్రికెట్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఒకవైపు రోహిత్, కోహ్లీ సెంచరీలు చేయగా, మరోవైపు బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ కేవలం 33, 36 బంతుల్లోనే సెంచరీలు బాది సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే, అందరి దృష్టి మాత్రం టీమిండియా 'రో-కో' జోడీపైనే నిలిచింది.

ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్.. ఇక World Cup నుంచి తప్పించే దమ్ముందా అంటోన్న ఫ్యాన్స్
Rohit Sharma Virat Kohli

Updated on: Dec 24, 2025 | 4:55 PM

భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్లోకి ఘనంగా పునరాగమనం చేశారు. బుధవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (2025-26) తొలి రౌండ్ మ్యాచ్‌లలో ఇద్దరూ సెంచరీలతో విరుచుకుపడి, తమ ఫామ్, ఫిట్‌నెస్‌పై స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న కోహ్లీ ఢిల్లీ తరపున, అలాగే 7 ఏళ్ల తర్వాత ఆడిన రోహిత్ ముంబై తరపున అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు.

రోహిత్ శర్మ ‘హిట్‌మ్యాన్’ షో..

జైపూర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేశారు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రోహిత్, మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించారు. ఇందులో 14 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని ముంబై జట్టు సిక్కిం నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. తన 38వ లిస్ట్-ఏ సెంచరీతో రోహిత్ రాబోయే కివీస్ సిరీస్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని నిరూపించుకున్నారు.

విరాట్ కోహ్లీ ‘ఛేజ్ మాస్టర్’ మార్క్..

బెంగళూరులోని అలుర్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. ఆంధ్ర జట్టు విసిరిన 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశారు. 101 బంతుల్లో 131 పరుగులు (14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సెంచరీతో కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించిన 9వ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నా, తన క్లాస్ ఏమాత్రం తగ్గలేదని కోహ్లీ నిరూపించారు.

రికార్డుల పరంపర..

ఈ ఒక్క రోజే భారత దేశవాళీ క్రికెట్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఒకవైపు రోహిత్, కోహ్లీ సెంచరీలు చేయగా, మరోవైపు బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ కేవలం 33, 36 బంతుల్లోనే సెంచరీలు బాది సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే, అందరి దృష్టి మాత్రం టీమిండియా ‘రో-కో’ జోడీపైనే నిలిచింది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిర్ణయం అభిమానులకు పండగలా మారింది. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు యువ ఆటగాళ్లతో కలిసి మైదానంలో ఆడటం వల్ల టోర్నీ స్థాయి పెరగడమే కాకుండా, వారి వ్యక్తిగత ఫామ్ కూడా మెరుగుపడుతుంది. రాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ముందు వీరిద్దరూ ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు సానుకూల అంశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..