Ind vs Eng : గుండెలు బద్దలయ్యాయి.. టీమిండియా ఓటమిపై ఎమోషనల్ అయిన క్రికెట్ దిగ్గజాలు

లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఓటమిపై దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ ఓటమి పట్ల వారు తీవ్ర నిరాశ చెందారు. రవీంద్ర జడేజాను కొనియాడారు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ లీడ్స్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Ind vs Eng :  గుండెలు బద్దలయ్యాయి.. టీమిండియా ఓటమిపై ఎమోషనల్ అయిన క్రికెట్ దిగ్గజాలు
Ind Vs Eng

Updated on: Jul 15, 2025 | 6:49 PM

Ind vs Eng : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జరిగింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. దీంతో టీమిండియాకు నాలుగో ఇన్నింగ్స్‌లో గెలవడానికి కేవలం 193 పరుగుల లక్ష్యం మాత్రమే లభించింది. కానీ, భారత బ్యాట్స్‌మెన్ అందరినీ నిరాశపరిచారు. రవీంద్ర జడేజా (61*) చివరి వరకు పోరాడినా, భారత్‌ను గెలిపించలేకపోయాడు. ఈ ఓటమి కోట్ల మంది భారత అభిమానులతో పాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ హృదయాలను బద్దలు చేసింది.

టీమిండియా ఓటమి తర్వాత అభిమానుల లాగే సచిన్, గంగూలీ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓటమిపై తమ అభిప్రాయాలను Xలో పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ ఎక్స్ లో “చాలా దగ్గర్లో ఉన్నా, విజయం మాత్రం దూరంగానే ఉంది. జడేజా, బుమ్రా, సిరాజ్ చివరి వరకు పోరాడారు. టీమిండియా మంచి ప్రయత్నం చేసింది. ఇంగ్లాండ్ కూడా ఒత్తిడిని నిలబెట్టుకుని, వారికి కావలసిన ఫలితాన్ని సాధించింది. కష్టపడి సాధించిన విజయానికి అభినందనలు” అని ట్వీట్ చేశాడు.

“ఎంత గొప్ప టెస్ట్ మ్యాచ్! భారత్ లార్డ్స్ నుంచి చాలా నిరాశతో వెనుదిరుగుతుంది. మూడు టెస్ట్ మ్యాచ్‌లలో బాగా ఆడినా, 2-1తో వెనకబడింది. ఇది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్. జడేజా అద్భుతంగా పోరాడి 193 పరుగుల టార్గెట్ పెద్దది కాదని నిరూపించాడు” అని పోస్ట్ చేశాడు.

ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ లీడ్స్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌ను భారత జట్టు గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లార్డ్స్ టెస్ట్‌కు ముందు రెండు జట్లు సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌కు సిరీస్‌లో ఆధిక్యం సాధించే అవకాశం లభించింది. కానీ, 193 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..