క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాజీ దిగ్గజాలు మరోసారి మైదానంలోకి.. ఎప్పుడో తెలుసా?

|

Sep 18, 2021 | 7:28 AM

India Legends Team: వచ్చే ఏడాది యూఏఈలో జరగనున్న ఈ ప్రత్యేక లీగ్‌లో ఏ భారతీయ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిర్వాహకులు మాత్రం టీంలను ప్రకటించారు.

క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాజీ దిగ్గజాలు మరోసారి మైదానంలోకి.. ఎప్పుడో తెలుసా?
India Legends Team
Follow us on

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. త్వరలో మాజీ స్టార్స్‌ని మరోసారి మైదానంలో చూసే అవకాశం లభించనుంది. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన స్టార్ ఆటగాళ్ల ఆటను మరోసారి చూసేందుకు సిద్ధంగా ఉండండి. వచ్చే ఏడాది యూఏఈలో ఒక ప్రత్యేక లీగ్ నిర్వహించబోతోంది. దీనిలో భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు కనిపించనున్నారు. ఈ ప్రత్యేక లీగ్ యూఏఈలో వచ్చే ఏడాది మార్చిలో ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’ పేరుతో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. టోర్నమెంట్ నిర్వాహకులు శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

టోర్నమెంట్ కోసం సంతకం చేసిన ఆటగాళ్ల పేర్లను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. అయితే, ఇందులో భారతదేశం, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు చెందిన అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే ఆలోచనతో రోడ్డు భద్రతా సిరీస్‌లలో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆరు విభిన్న దేశాల జట్లు పాల్గొంటాయి. అయితే, ఈ టోర్నమెంట్‌లో కేవలం మూడు జట్లు మాత్రమే ఉంటాయి.

ఈ సిరీస్ సంవత్సరానికి రెండుసార్లు..
‘లీగ్ ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తాం. మొదటి సీజన్‌లో, లీగ్ ట్రై-సిరీస్ లా ఉండనుంది. ఇందులో భారత జట్టు, ఆసియా జట్టు, మిగిలిన ప్రపంచ జట్టు ఒకరితో ఒకరు తలపడతాయి. ఫైనల్‌కు ముందు ఆరు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి” అని నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక పెద్ద టోర్నమెంట్ అని దాని సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ వివేక్ ఖుష్లానీ అన్నారు. ‘మేము ఎంతో సంతోషిస్తున్నాము. భారత లెజెండ్స్ ఆటను మరోసారి చూడటం చాలా ఆనందంగా ఉందని’ ఆయన అన్నారు.

రోడ్ సేఫ్టీ సిరీస్ లాంటిదే..
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కూడా ఇలాంటి టోర్నమెంటే. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు, ఇతర లీగ్‌లో భాగం కాని వారు ఇందులో ఆడతారు. ఈసారి 6 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారతదేశం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మాజీ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు ఇండియన్ లెజెండ్స్ జట్టులో ఆడతారు.

Also Read: BCCI: జూనియర్ సెలెక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. చైర్మన్‌గా 27 సెంచరీలు చేసిన ఆటగాడు..

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో ‘మిషన్ 87’ను ముగించే దిశగా విరాట్ కోహ్లీ.. అసలు దీని లక్ష్యమేంటో తెలుసా?

IPL 2021: విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల మధ్య బౌండరీల పోరు.. ఎవరు ముందున్నారో తెలుసా?