Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌ను వెంటాడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ల శాపం..గవాస్కర్ చెప్పింది నిజమే

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక బలహీనత పదేపదే సమస్యగా మారుతోంది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఆయన్ను ఇబ్బంది పెట్టిన అదే బలహీనత, ఇప్పుడు వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో కూడా వెంటాడుతోంది. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో జైస్వాల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌ను వెంటాడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ల శాపం..గవాస్కర్ చెప్పింది నిజమే
Yashasvi Jaiswal (1)

Updated on: Nov 30, 2025 | 3:29 PM

Yashasvi Jaiswal : టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక బలహీనత పదేపదే సమస్యగా మారుతోంది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఆయన్ను ఇబ్బంది పెట్టిన అదే బలహీనత, ఇప్పుడు వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో కూడా వెంటాడుతోంది. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో జైస్వాల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ వికెట్ తీసిన సౌతాఫ్రికా బౌలర్ నాండ్రే బర్గర్ తనదైన స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు.

యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. మొదటి బంతినే బౌండరీగా మలిచి ఖాతా తెరిచిన ఈ ఆటగాడు, మూడో ఓవర్‌లో ఒక చక్కటి సిక్సర్ కూడా కొట్టాడు. అయితే తన 16వ బంతి వద్ద అతను అవుటయ్యాడు. నాండ్రే బర్గర్ వేసిన ఆఫ్-స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి, బ్యాట్ అంచుకు తగిలించుకొని వికెట్ కీపర్ డి కాక్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఈ ఔట్‌తో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కోవడంలో జైస్వాల్ ఇబ్బంది పడుతున్నాడా అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.

యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేయడం ఎడమచేతి వాటం పేసర్‌లకు ఒక ఎడమ చేతి ఆటగా మారుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో జైస్వాల్‌ను అత్యధికంగా అవుట్ చేసిన బౌలర్లలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లే ఉండడం దీనికి నిదర్శనం. మార్కో యాన్సన్, నాండ్రే బర్గర్ జైస్వాల్‌ను చెరో నాలుగు సార్లు అవుట్ చేశారు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్, స్కాట్ బోలాండ్ మూడేసి సార్లు అవుట్ చేయగా, మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జైస్వాల్‌ను మూడుసార్లు పెవిలియన్ చేర్చాడు.

జైస్వాల్‌కు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కోవడంలో కచ్చితంగా సమస్య ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మ్యాచ్ సమయంలో విశ్లేషించారు. లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్లు వేసే బయటకు వెళ్లే బంతులపై జైస్వాల్ సరిగా ఆడలేకపోతున్నాడు. దీనికి కారణం అతని ముందు అడుగు సరిగ్గా ముందుకు పడకపోవడమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఈ బలహీనతను త్వరగా అధిగమించకపోతే, భవిష్యత్తులో అతను పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..