IND vs WI: భారత్, విండీస్ మ్యాచ్‌కి వర్షం ముప్పు.. ఫ్లోరిడా వాతావరణ నివేదిక వివరాలివే..

|

Aug 13, 2023 | 5:12 PM

IND vs WI: 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్.. 3,4 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించాయి. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-2 గా సమమైంది. ఇక నేటి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్ టీ20 సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. భారత్, వెస్టిండీస్ మధ్య ఫ్లోరిడాలో జరిగే 5వ టీ20 మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉందని weather.com తెలిపింది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ భారత కాలమనం ప్రకారం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. 5 గంటల సమయంలో వర్షం పడే అవకాశం..

IND vs WI: భారత్, విండీస్ మ్యాచ్‌కి వర్షం ముప్పు.. ఫ్లోరిడా వాతావరణ నివేదిక వివరాలివే..
IND vs WI, 5th T20I
Follow us on

IND vs WI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయింది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు సొంతం చేసుకున్న టీమిండియా.. నేడు జరిగే 5వ టీ20 మ్యాచ్‌లో గెలిసి ఈ సిరీస్‌ని కూడా కైవలం చేసుకోవాలనే దిశగా ఆడుగులు వేస్తుంది. వెస్టిండీస్ జట్టు కూడా సిరీస్‌ని నిర్దేశించే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీమిండియాను దెబ్బ తీయాలని భావిస్తోంది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్.. 3,4 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించాయి. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-2 గా సమమైంది. ఇక నేటి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్ టీ20 సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. భారత్, వెస్టిండీస్ మధ్య ఫ్లోరిడాలో జరిగే 5వ టీ20 మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉందని weather.com తెలిపింది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ భారత కాలమనం ప్రకారం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. 5 గంటల సమయంలో వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ నివేదిక పేర్కొంది.

కాగా, శనివారం జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తరఫున షిమ్రాన్ హెట్మేయర్ 61 పరుగుల ఆర్థ సెంచరీతో రాణించగా, షై హోప్ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక భారత్ తరఫున ఆర్ష్‌దీప్ సింగ్ 3, కుల్తీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలా వెస్టిండీస్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన టీమిండియా ఓపెనర్లు శుభమాన్ గిల్, యశస్వీ జైస్వాల్ అద్భుతమైన రీతిలో 165 పరుగుల భాగస్వామ్యం అందించి.. భారత్ తరఫున అతి పెద్ద టీ20 ఓపనింగ్ పార్ట్నర్‌షిప్ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో శుభమాన్ 77 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. జైస్వాల్ అజేయంగా 84 పరుగులు చేశాడు. అలాగే చివర్లో వచ్చిన తిలక్ వర్మ కూడా అజేయంగా 7 పరుగులు సాధించాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమైంది.

అర్ధ సెంచరీలతో భారత ఓపెనర్లు

జైస్వాల్, గిల్ పరుగులు 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జైస్వాల్

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ టీ20 రికార్డ్‌ని సమం చేసిన జైస్వాల్, శుభమాన్ 

5వ టీ20 ఆడే ఇరు జట్లు(అంచనా):

భారత జట్టు: శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల్ హొస్సేన్, ఒబెడ్ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్.