IND vs WI: వెస్టిండీస్ పర్యటనతో ఈ భారత ఆటగాడి కెరీర్ క్లోజ్.. పాపం.. ప్లేయింగ్ 11లో చేరకుండానే?

|

Jul 19, 2023 | 11:46 AM

India vs West Indies 2nd Test: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ట్రినిడాడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓ టీమిండియా ఆటగాడికి అవకాశం లభించడం కష్టం.

IND vs WI: వెస్టిండీస్ పర్యటనతో ఈ భారత ఆటగాడి కెరీర్ క్లోజ్.. పాపం.. ప్లేయింగ్ 11లో చేరకుండానే?
Ind Vs Wi 1st Test
Follow us on

India vs West Indies 2nd Test: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండోది, చివరి మ్యాచ్ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జులై 20 నుంచి జరగనుంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ విజయంపైనే టీమిండియా కన్ను వేసింది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఒక ఆటగాడికి అవకాశం లభించడం కష్టంగా కనిపిస్తోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో కూడా ఈ ఆటగాడు ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయాడు.

రెండో టెస్టులోనూ ఛాన్స్ కష్టమే..

వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టులో ఇద్దరు వికెట్‌ కీపర్లు చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్. టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపర్‌గా ప్లేయింగ్ 11లో చోటు కల్పించాడు. అతను వికెట్ కీపర్‌గా బాగా రాణించినప్పటికీ, బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టులోనూ ఆడతాడని అంతా భావిస్తున్నారు. దీని కారణంగా కేఎస్ భరత్ మరోసారి ప్లేయింగ్ 11కు దూరంగా ఉండాల్సి రావొచ్చు.

ఆస్ట్రేలియాతో అరంగేట్రం మ్యాచ్..

ఐపీఎల్ 2023కి ముందు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆడే అవకాశం కేఎస్ భరత్‌కు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కేఎస్ భారత్ 8, 6, 23 (నాటౌట్), 17, 3, 44 మాత్రమే స్కోర్ చేయగలిగాడు. కేఎస్ భరత్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. భరత్ గత ఏడాది కాలంగా రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా తయారయ్యాడు. అంతకుముందు ఇండియా ఏ జట్టులో సాధారణ సభ్యుడిగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫ్లాప్..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఆడే అవకాశం కూడా కేఎస్ భరత్‌కి దక్కింది. కెరీర్‌లో 5వ టెస్టు ఆడేందుకు వచ్చిన కేఎస్ భరత్ బ్యాటింగ్‌లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అతడిని స్కాట్ బోలాండ్ బౌల్డ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను నంబర్-7 వద్ద బ్యాటింగ్‌కు దిగి 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈసారి 41 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు బాదాడు.

రెండో టెస్టుకు భారత టెస్టు జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ.

రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు..

క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అతానాజ్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్‌కెంజీ, కెమర్ రోచ్, జోమెల్ సింక్లెయిర్, జోమెల్ సింక్లెయిర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..