DC vs KKR, IPL 2021: తడబడిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా టార్గెట్ 136..!

|

Oct 13, 2021 | 9:26 PM

DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది.

DC vs KKR, IPL 2021: తడబడిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా టార్గెట్ 136..!
Kkr Vs Dc, Ipl 2021
Follow us on

DC vs KKR, IPL 2021: రెండో క్వాలిఫయర్‌లో తలపడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని చాలా తక్కువ పరుగులకు కట్టడి చేశారు. పృథ్వీ షా(18) పరుగులతో మంచి ఊపులో ఉన్నప్పుడు చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ, పరుగులు సాధించడంలో వెనుకపడ్డారు. ధావన్ (36) ఒక్కడే అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. స్టోయినిస్ 18, రిషబ్ పంత్ 6, హెట్ మెయిర్ 17 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ 24, అక్షర్ పటేల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివం మావి, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3-2తో ఆధిక్యం సంపాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 29 సార్లు ఐపీఎల్‌లో తలపడతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 15 మ్యాచ్‌లు గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

ప్లేయింగ్ ఎలెవన్ :
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్‌మెయర్, టామ్ కుర్రాన్/మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

Also Read: DC vs KKR Live Score, IPL 2021: తక్కువ పరుగులకే ఢిల్లీని కట్టడి చేసి కోల్‌కతా బౌలర్లు.. మోర్గాన్ సేన టార్గెట్ 136

IPL 2021: ఆ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు.. తొలిసారి ఆ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్