
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి, అతను వికెట్ల మధ్య ఎంత క్విక్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 36 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సూపర్ ఫిట్‌నెస్‌తో గ్రౌండ్‌లో అద్భుతంగా 16 ఏళ్ల కుర్రాడిలా కదులుతూ ఉంటాడు. కోహ్లీ క్రీజ్‌లో ఉంటే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పరిగెత్తలేక చావాలి అని చాలా మంది క్రికెట్ అభిమానులు సరదాగా అంటూ ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించాడు కింగ్ కోహ్లీ. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తోంది. పంజాబ్ మెయిన్ బౌలర్ అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొట్టాడు.
ఆ బాల్ ఆపేందుకు ఫీల్డర్ పాపం ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. చివరి నిమిషంలో బాల్‌ను తన కాలితో బౌండరీ రోప్‌కు తగలకుండా ఆపి, తాను బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లైన్ దాటి ముందుకు వెళ్లిపోయాడు.. వావ్.. అద్భుతంగా బౌలంగరీ సేవ్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ, వికెట్ల మధ్య పడిక్కల్‌తో కలిసి పరిగెడుతుంది విరాట్ కోహ్లీ కదా.. చిరుతలా పరిగెత్తి ఏకంగా నాలుగు పరుగులు లాక్కున్నాడు. సో.. ఫీల్డర్ బాల్ బౌండరీకి పోకుండా ఆపినా లాభం లేకపోయింది. పాపం.. పడిక్కల్ కోహ్లీతో కలిసి పరిగెట్టలేక ఇబ్బంది పడ్డాడు. పడిక్కల్‌తో పాటు మరే బ్యాటర్ అక్కడున్న కచ్చితంగా మూడే రన్స్ వచ్చేవి. కానీ, కోహ్లీ వేగానికి అక్కడ నాలుగో రన్ కూడా వచ్చింది.
KOHLI & PADIKKAL RUNNING FOUR IN A AFTERNOON MATCH 🥶 pic.twitter.com/L786SgO4yQ
— Johns. (@CricCrazyJohns) April 20, 2025
THE FITNESS OF VIRAT KOHLI AT THE AGE OF 36 🤯🔥 pic.twitter.com/qGwvoS0ycb
— Johns. (@CricCrazyJohns) April 20, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.