Kohli vs Babar: విరాట్ కోహ్లీ వర్సెస్ బాబర్ ఆజం.. ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సారథి ఏమన్నాడంటే?

|

Mar 20, 2022 | 4:33 PM

ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లి, బాబర్ అజామ్‌లను చాలా మంది పోల్చుతున్నారు. ఇద్దరు ఆటగాళ్లు గొప్ప బ్యాట్స్‌మెన్స్‌గా పేరుగాంచారు.

Kohli vs Babar: విరాట్ కోహ్లీ వర్సెస్ బాబర్ ఆజం.. ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సారథి ఏమన్నాడంటే?
Babar Azam, Virat Kohli
Follow us on

బంతిని మెరుగుపరిచేందుకు లాలాజలాన్ని ఉపయోగించడంపై ముందస్తుగా విధించిన నిషేధం ఊహించినంత పెద్దది కాదని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins)పేర్కొన్నాడు. లాలాజలం వాడకంపై శాశ్వత నిషేధం ఫాస్ట్ బౌలర్లకు మాత్రం షాకింగ్ విషయమేనని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మే 2020లో లాలాజలం వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam)ల పోలికపై ఆస్ట్రేలియా కెప్టెన్ తన అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నాడు.

అలాగే Marylebone Cricket Club (MCC) ఇటీవల లాలాజలం వాడకంపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఇది ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమలులోకి వస్తుంది. MCC తన పరిశోధన ప్రకారం, లాలాజలం అప్లై చేయడం వల్ల బంతి వేగంపై ఎటువంటి ప్రభావం చూపలేదని, అయితే, దిశను మార్చడానికి లాలాజలాన్ని ఉపయోగించడం మాత్రం అనుచితమైన ప్రవర్తనగా ఎంసీసీ పరిగణించింది.

ప్రస్తుతం ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకరైన కమిన్స్, పాకిస్థాన్‌తో మూడో టెస్టుకు ముందు, “నేను అలా అనుకోను (లాలాజల నిషేధం స్వింగ్ బౌలర్ల ప్రదర్శనను ప్రభావితం చేస్తుంది)” అని చెప్పాడు. ఇది పెద్ద ప్రభావం చూపింస్తుందని నేను అనుకోను. మనం ప్రస్తుతం చెమటను ఉపయోగించవచ్చు.. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ, బాబర్‌ల పోలికపై ఏమన్నాడంటే?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 196 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు. వీరిద్దరి పోలిక గురించి కమ్మిన్స్‌ని ప్రశ్నించగా.. “వాళ్ళిద్దరూ నిజమైన బ్యాట్స్‌మెన్‌లు, వీరు ఏ ఫార్మాట్‌లో ఆడినా కచ్చితంగా సవాలు విసురుతారు. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. వీరిద్దరూ ఆస్ట్రేలియాపై చాలాసార్లు సెంచరీలు చేశారంటూ చెప్పుకొచ్చాడు.

కేకేఆర్‌కు ప్రాతినిధ్యంపై..

2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కమిన్స్ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లీగ్‌లో వచ్చే సీజన్‌లో మరోసారి కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. చాలా ఎగ్జైట్‌గా ఉన్నా.. చాలా మంది ఆటగాళ్లను జట్టు నిలబెట్టడం చాలా గొప్ప విషయం అంటూ తెలిపాడు.

శ్రేయస్ చాలా ప్రశాంతమైన వ్యక్తి – కమిన్స్

భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కేకేఆర్ టీం కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2017 సీజన్‌లో కమిన్స్ అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. శ్రేయస్‌, నేను ఢిల్లీ (డేర్‌ డెవిల్స్‌) తరఫున ఆడాం. మేం నిజంగా బాగా చేశాం. అతను చాలా ప్రశాంతమైన వ్యక్తిలా కనిపిస్తాడు. ప్రస్తుతానికి గొప్ప ఫాంలో ఉన్నాడని పేర్కొన్నాడు.

Also Read: Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?

IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?