క్రికెటర్లంటే వీళ్లే భయ్యా.. కెరీర్‌లో ఒక్కసారి కూడా రనౌట్ కాలే.. టాప్ 5లో మనోడు.. గెస్ చేస్తే తోపులే?

Unbelievable Cricket Run Out Records: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్కసారీ రనౌట్ కాని ఐదుగురు అగ్రశ్రేణి క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీటర్ మే నుంచి పాల్ కాలింగ్‌వుడ్ వంటి దిగ్గజ ఆటగాళ్ళు తమ అద్భుతమైన కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ అవ్వలేదు. వీళ్ల బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ల మధ్య పరుగెత్తే వేగంతో క్రికెట్ చరిత్రలో తమకంటూ ఓ స్పెషల్ రికార్డ్‌ను లిఖించుకున్నారు.

క్రికెటర్లంటే వీళ్లే భయ్యా.. కెరీర్‌లో ఒక్కసారి కూడా రనౌట్ కాలే.. టాప్ 5లో మనోడు.. గెస్ చేస్తే తోపులే?
Cricket Legends Never Run Out Tests

Updated on: May 02, 2025 | 1:51 PM

Cricket Legends Never Run Out Tests: క్రికెట్‌లో ఎప్పుడు, ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణాల్లో మ్యాచ్‌లు మారిపోతుంటాయి. ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. మరికొన్ని బ్రేక్ అవుతుంటాయి. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో ఒక్కసారి కూడా రనౌట్ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లిస్టు‌లో ఐదుగురు దిగ్గజాలు ఉన్నారు. టాప్ లిస్ట్‌లో ఓ టీమిండియా దిగ్గజం పేరు కూడా ఉంది.

1. పీటర్ మే: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మన్ పీటర్ మే తన కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు. అతను చాలా క్లాసిక్ బ్యాటర్‌‌తోపాటు గొప్ప కెప్టెన్‌గా పేరుగాంచాడు. 1951లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ తరపున పీటర్ మే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. పీటర్ మే ఇంగ్లాండ్ తరపున 66 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4537 పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 235. అతను వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తేవాడు.

2. గ్రాహం హిక్: జింబాబ్వేలో జన్మించిన గ్రాహం హిక్ ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడాడు. అతను ఇంగ్లాండ్ తరపున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 3000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ చూసి అభిమానులు చాలా సంతోషించారు. గ్రాహం హిక్ తన మొత్తం కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

ఇవి కూడా చదవండి

3. ముదస్సర్ నాజర్: ఈ లిస్టులో పాకిస్తాన్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ముదస్సర్ నాజర్ తన మొత్తం కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు. ముదస్సర్ నాజర్ పాకిస్తాన్ తరపున 76 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4114 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు ఉన్నాయి. 122 వన్డేలు ఆడి, నాజర్ 2653 పరుగులు చేశాడు.

4. కపిల్ దేవ్: కపిల్ దేవ్, ఈ పేరు భారత అభిమానుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా వెస్టిండీస్ జట్టును ఓడించి తొలి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారతదేశం తరపున 131 టెస్ట్ మ్యాచ్‌ల్లో కపిల్ 5248 పరుగులు చేసి 434 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, అతను వన్డే క్రికెట్‌లో 3000 కి పైగా పరుగులు చేసి 253 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ తన మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

5. పాల్ కాలింగ్‌వుడ్: ఇంగ్లాండ్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడిన పాల్ కాలింగ్‌వుడ్ ఒక అద్భుతమైన బ్యాట్స్‌మన్. అతను ఇంగ్లీష్ జట్టు తరపున 68 టెస్ట్ మ్యాచ్‌ల్లో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించాడు. పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్ జట్టు 2010 ఐసీసీ టీ20 ప్రపంచ ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రికెటర్ తన మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..