IPL 2026: ఆ ముగ్గురిపై బీసీసీఐ బ్యాన్.. ఐపీఎల్‌లో కనిపించరిక.. లిస్టులో ధోని టీమ్‌మేట్

ఐపీఎల్ 2026 వేలానికి రంగం సిద్దమైంది. 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేయగా.. 350 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్ లిస్టు చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

IPL 2026: ఆ ముగ్గురిపై బీసీసీఐ బ్యాన్.. ఐపీఎల్‌లో కనిపించరిక.. లిస్టులో ధోని టీమ్‌మేట్
Ipl 2026 Auction

Updated on: Dec 10, 2025 | 9:01 AM

పొట్టి ఫార్మాట్ సందడి మొదలు కానుంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. మంగళవారం BCCI మినీ వేలంలో పాల్గొనే 350 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను వేలంలో నమోదు చేయగా.. కేవలం 350 మందికి మాత్రమే చోటు దొరికింది. అలాగే ముగ్గురు ఆటగాళ్లపై బీసీసీఐ బ్యాన్ విధించింది. ఈ ముగ్గురూ ఇంగ్లాండ్‌కు చెందినవారు కావడం గమనార్హం.

ఈ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం

ఐపీఎల్ 2026 మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోగా.. బీసీసీఐ ఈ ముగ్గురు ఆటగాళ్లపై బ్యాన్ విధించింది. వారెవరో కాదు.. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్. 2025 IPL వేలంలో అమ్ముడైన హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్.. వివిధ వ్యక్తిగత కారణాల కారణంగా లీగ్ నుంచి వైదొలిగారు. BCCI నిబంధనల ప్రకారం, ఆ ఇద్దరిపై రెండేళ్లపాటు నిషేధం అమలులో ఉంది. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇంగ్లాండ్ దేశీయ సీజన్ ఆడటానికి అతడు లీగ్‌ను విడిచిపెట్టాడు. అందువల్ల, బ్రూక్‌ను 2026, 2027 వరకు నిషేధించారు. జాసన్ రాయ్ 2024లో వ్యక్తిగత కారణాల వల్ల IPL నుంచి నిష్క్రమించాడు. 2025 వేలంలో కనిపించలేదు. బెన్ స్టోక్స్ కూడా ఈ విధంగానే బ్యాన్‌కు గురయ్యాడు.

ఆటగాడి పేరు దేశం ధర
డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) రూ .2 కోట్లు
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా) రూ. 2 కోట్లు
కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) రూ. 2 కోట్లు
సర్ఫరాజ్ ఖాన్ (భారత్) 75 లక్షలు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) రూ. 2 కోట్లు
పృథ్వీ షా (భారతదేశం) 75 లక్షలు