IPL Toss Coin: టాస్ కాయిన్స్ దేనితో తయారు చేస్తారు.. టోర్నమెంట్ తర్వాత ఆ నాణేలను ఏం చేస్తారో తెలుసా?

|

May 02, 2023 | 8:15 PM

Toss Coin in IPL: ఈ సంవత్సరం (2023) IPL 16వ సీజన్ జరుగుతోంది. ఇప్పటి వరకు సీజన్‌లో సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్ లేదా మరేదైనా మ్యాచ్ టాస్‌తో ప్రారంభమవుతుంది. దీని కోసం నాణెం అవసరం. ఐపీఎల్‌లో టాస్‌కు ఉపయోగించే నాణెం ఏ లోహంతో తయారు చేస్తారో మీకు తెలుసా?

IPL Toss Coin: టాస్ కాయిన్స్ దేనితో తయారు చేస్తారు.. టోర్నమెంట్ తర్వాత ఆ నాణేలను ఏం చేస్తారో తెలుసా?
Ipl Toss Coin
Follow us on

ఈ సంవత్సరం (2023) IPL 16వ సీజన్ జరుగుతోంది. ఇప్పటి వరకు సీజన్‌లో సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్ లేదా మరేదైనా మ్యాచ్ టాస్‌తో ప్రారంభమవుతుంది. దీని కోసం నాణెం అవసరం. ఐపీఎల్‌లో టాస్‌కు ఉపయోగించే నాణెం ఏ లోహంతో తయారు చేస్తారో మీకు తెలుసా? టోర్నమెంట్ ముగిసిన తర్వాత బీసీసీఐ నాణేలను ఏమి చేస్తుందో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నాణెం ఏ లోహంతో తయారు చేస్తారంటే?

ఐపీఎల్‌లో టాస్‌కు ఉపయోగించే నాణేలను బంగారంతో తయారు చేస్తారు. ఈ నాణేలు సాధారణ నాణేలలా కాకుండా టాస్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. నివేదికలను విశ్వసిస్తే, నాణేల బరువు ఐపిఎల్ సీజన్ ప్రకారం ఉంటుంది. ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ జరుగుతుండగా, నాణేల బరువు 16 గ్రాములుగా ఉంది. అదే సమయంలో బంగారం పెరుగుతున్న, తగ్గుతున్న ధర ప్రకారం దాని ధర ఉంటుంది.

నాణేలను తయారు చేసే హక్కు బీసీసీఐకి ఉంది. BCCI ఒక సీజన్‌కు 20 నుంచి 25 నాణేలను తయారు చేస్తుంది. IPL ప్రతి వేదికకు 2 నాణేలు ఇస్తుంటుంది. మిగిలిన నాణేలు బ్యాకప్‌గా ఉంచుతారు. మరోవైపు, నాణేల రూపకల్పన గురించి మాట్లాడితే, ఓవైపు ‘H’ అంటే హెడ్, మరొక వైపు ‘T’ అంటే టెయిల్ అని రాసి ఉంటుంది. నాణెం టెయిల్స్ వైపు టోర్నమెంట్ స్పాన్సర్ పేరు రాసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

IPL తర్వాత BCCI నాణేలను ఏమి చేస్తుంది?

ఐపీఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ నాణేలను వేలం వేస్తుంది. వేలంలో లక్షల ధరకు నాణేలు అమ్ముడవుతున్నాయి. నివేదికల ప్రకారం, BCCI IPL 2014 కంటే ముందు అన్ని నాణేలను వేలం వేసింది. ఆ వేలంలో ఈ నాణేలు లక్షల ధరలకు అమ్ముడయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..