IPL 2025: ఐపీఎల్‌లో చీర్ గర్ల్స్ జీతం ఎంతో తెలిస్తే మీరూ స్టన్ అవ్వడం పక్కా..

సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాదు.. ఐపీఎల్‌లో చీర్ లీడర్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. ఒక్కో మ్యాచ్ కోసం వీరు ఎంత పారితోషికం తీసుకుంటారో మీకు తెల్సా.? ఎంత వస్తుందో తెలిస్తే మీరు స్టన్ అవ్వడం పక్కా.. మరి లేట్ ఎందుకు చూసేయండి.

IPL 2025: ఐపీఎల్‌లో చీర్ గర్ల్స్ జీతం ఎంతో తెలిస్తే మీరూ స్టన్ అవ్వడం పక్కా..
Cheer Leaders

Updated on: May 03, 2025 | 7:06 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యం టోర్నమెంట్ చివరిస్టేజికి రావడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. బెంగళూరు, ముంబై, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ జట్లు టాప్ 2 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ లీగ్‌కు టాప్ ప్లేయర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. వారికంటే ఎక్కువగా చీర్ లీడర్స్ తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తమ జట్టు ప్లేయర్స్ ఫోర్, సిక్స్ కొట్టినా.. వికెట్ తీసినా అభిమానులతో పాటు చీర్ లీడర్స్ తమ టీంను ఎంకరేజ్ చేస్తుంటారు. మరి ఈ చీర్ లీడర్స్‌కి జీతం ఎంత ఉంటుందని అనుకునేరు.. చాలామంది వీరి శాలరీ లక్షల్లో ఉంటుందని ఊహిస్తారు. కానీ కాదు. ఐపీఎల్ చీర్ గర్ల్స్ శాలరీ అనేది ఫ్రాంచైజీల బట్టి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ చీర్ లీడర్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 12 వేలు ఇస్తాయి. ఇక ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు చీర్ గర్ల్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 వేల శాలరీ ఇస్తాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే చీర్ లీడర్స్‌కి ఎక్కువ శాలరీ కోల్‌కతా నైట్ రైడర్స్ ఇస్తుంది. వీరు ఒక్కో మ్యాచ్‌కు చీర్ లీడర్స్‌కి రూ. 24 వేలు చెల్లిస్తుంది. ఇలా సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక్కో చీర్ గర్ల్‌కి రూ. 2 లక్షల వరకు శాలరీ వస్తుంది. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీలు చీర్ గర్ల్స్‌ను నేరుగా ఎంపిక చేయవు. వీరి ఎంపిక ఏజెన్సీల ద్వారా జరుగుతుంది.