IPL 2022: ఐపీఎల్ 2022లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌‌గా మారిన భారత ఓపెనర్.. కోహ్లీ, రోహిత్‌లు వెనుకంజలోనే..

|

Jan 22, 2022 | 12:39 PM

Lucknow- KL Rahul: కేఎల్ రాహుల్‌తో పాటు, లక్నో ఫ్రాంచైజీ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ రవి బిష్ణోయ్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌లను రిటైన్ చేసుకుంది.

IPL 2022: ఐపీఎల్ 2022లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌‌గా మారిన భారత ఓపెనర్.. కోహ్లీ, రోహిత్‌లు వెనుకంజలోనే..
Kl Rahul Team India Vice Captain
Follow us on

IPL 2022: కొత్త IPL ఫ్రాంచైజీ లక్నో కేఎల్ రాహుల్‌(KL Rahul)ని లీగ్ సీజన్ 15 లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చేసింది(highest-paid player in IPL 2022). లక్నో ఫ్రాంచైజీ రాహుల్‌ను రూ. 17 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అలాగే రాహుల్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేసింది. రూ. 17 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, విరాట్ కోహ్లీ(Virat Kohli) తో కలిసి ఐపిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. 2018లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో విరాట్ కోహ్లిని రూ.17 కోట్లకు ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. రూ. 17 కోట్లకు విరాట్‌తో RCBతో ఈ ఒప్పందం 2021 సంవత్సరం వరకు ఉంది.

కేఎల్ రాహుల్‌తో పాటు, లక్నో ఫ్రాంచైజీ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ రవి బిష్ణోయ్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌లను కూడా చేర్చుకుంది. లక్నో స్టోయినిస్‌ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేయగా, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత, లక్నో జట్టు వద్ద ఇంకా రూ.59.89 కోట్లు మిగిలి ఉన్నాయి.

రాహుల్ నాయకత్వంలో బలమైన పునాది సిద్ధమవుతోంది: గోయెంకా
స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ, “ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టు పునాదిని బలోపేతం చేయబోతున్నారు. కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, వికెట్ కీపర్ కూడా. స్టోయినిస్ అద్భుతమైన ఫినిషర్, అతను బంతితో అద్భుతాలు చేయగలడు. ఫీల్డింగ్‌లో కూడా అద్భుతమైనవాడు. అదే సమయంలో, రవి బిష్ణోయ్ చేరిక జట్టు స్పిన్ విభాగానికి జీవం పోస్తుంది. అలాగే అతను గొప్ప ఫీల్డర్ కూడా. ఈ ముగ్గురు ఆటగాళ్లతో తమ జట్టు కుదుర్చుకున్న ఒప్పందం 7-8 ఏళ్ల పాటు కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు” గోయెంకా తెలిపాడు.

లక్నోలో నయా ‘నవాబ్’గా మారిన కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్‌పై రూ. 17 కోట్ల రూపాయల వర్షం కురిపించిన లక్నో ఫ్రాంచైజీ అతన్ని IPL 2022లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చేసింది. విరాట్ కోహ్లిని కూడా ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. కానీ, నివేదిక ప్రకారం, జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత, ప్రస్తుతం ఫ్రాంచైజీ విరాట్‌ని రూ.15 కోట్లు చెల్లించనుంది. అదే సమయంలో, ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ శర్మను రూ. 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. వీరితో పాటు రవీంద్ర జడేజాను రూ. 16 కోట్లకు సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకున్నాయి. మరోవైపు, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ లక్నోతో పాటు తన ముగ్గురు ఆటగాళ్ల పేర్లను కూడా ప్రకటించింది. దీని కోసం మొత్తం రూ. 38 కోట్లు ఖర్చు చేసింది. అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు కొనుగోలు చేసి జట్టుకు కెప్టెన్‌గా చేసింది. రషీద్ ఖాన్‌ను రూ. 15 కోట్లతో కొనుగోలు చేసింది.

మొత్తంమీద, విరాట్, రోహిత్‌లను వదిలి, కేఎల్ రాహుల్ ప్రస్తుతం IPL 2022లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఐపీఎల్‌, భారత క్రికెట్‌లో అతని గత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని కొల్లగొట్టాడు. క్రికెట్ పొట్టి ఫార్మాట్‌లో సాటిలేని బ్యాట్స్‌మెన్‌గా మారిని రాహుల్, ఐపీఎల్‌ గత 4 వరుస సీజన్‌లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసి సత్తా చాటాడు.

Also Read: IPL 2022 Auction: మెగా వేలంలో 1214 మంది ప్లేయర్లు.. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో 49 మంది.. లిస్టులో ఎవరున్నారంటే?

IND vs SA: నం.6లో అతడే కరెక్ట్.. అలా చేస్తే వన్డేల్లో టీమిండియా ఫినిషర్ బాధ తీరినట్లే: గవాస్కర్