
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గతేడాది వివాహ బంధంతో ఏకమయ్యారు. అయితే ఇటీవలే( మార్చి 24) ఈ దంపతులు ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇవాళ కేఎల్ రాహుల్ 33వ పుట్టిన రోజు సందర్భంగా తమ కుమార్తెకు నామకరణం చేశారు. తమ కూతురికి “ఇవారా” (Evaarah) అనే పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించారు. “ఇవారా” అంటే “దేవుడి బహుమతి” అని అర్థం వస్తుందట. తన కూతురికి పేరు పెట్టిన విషయాన్ని కేఎల్ రాహుల్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. కేఎల్ రాహుల్, అతియా దంపతులు తమ కుమార్తెను ఎత్తుకొని ఉన్న ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ..తమ కుమార్తె పేరును ప్రకటించారు. “మా పాప, మా సర్వస్వం. “ఇవారా” దేవుడిచ్చిన వరం” అంటూ కేఎల్ రాహుల్ పోస్ట్ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…