Kolkata Knight Riders vs Punjab Kings Highlights in Telugu: కోల్ కతా మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. సోమవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 180పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలోని 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో భానుక రాజపక్సే తిరిగి వచ్చాడు. కోల్‌కతా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో కోల్‌కతా, పంజాబ్‌లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు, ఈ సీజన్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో గెలిచింది. అదే సమయంలో, ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరు జట్లు 10 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా ఏడుసార్లు, పంజాబ్ మూడుసార్లు మాత్రమే గెలిచాయి.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
రస్సెల్, రింకూసింగ్ మెరుపులతో కోల్ కతా ఘన విజయం సాధించింది. సోమవారం రాత్రి ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల టార్గెట్ ను చివరి బంతికి అందుకుని టోర్నీలో 5 విజయాన్ని నమోదు చేసుంది. దీంతో పాటు ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
A ????????? ?????? at Eden Gardens ?
This one’s for you, Knight fam! ? pic.twitter.com/7gViVjaqQ3
— KolkataKnightRiders (@KKRiders) May 8, 2023
రస్సెల్ (16 బంతుల్లో 32 3 ఫోర్లు, 2 సిక్స్ లు ) ధన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో కోల్ కతా విజయానికి చేరువగా వచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు విజయానికి 9 బంతుల్లో 13 పరుగులు అవసరం. రింకూసింగ్ (10 బంతుల్లో 16) రసెల్ కు తోడుగా ఉన్నాడు.
కోల్ కతా ధాటిగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (41), వెంకటేశ్ అయ్యర్ (10) క్రీజులో. ఆ జట్టు విజయానికి 42 బంతుల్లో 73 పరుగులు అవసరం.
180 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్ కతా ధాటిగా ఆడుతోంది. అయితే ఓపెనర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 8 ఓవర్లకు 67/2. కెప్టెన్ నితీశ్ రాణా (10), వెంకటేశ్ అయ్యర్ (2) క్రీజులో ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కొనసాగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 180పరుగుల టార్గెట్ నిలిచింది.
పంజాబ్ జట్టు 17 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కరన్, షారుఖ్ ఖాన్ ఉన్నారు.
పంజాబ్ జట్టు 13 ఓవర్లలో 4 వికెట్లకు 109 పరుగులు చేయగా.. కెప్టెన్ శిఖర్ ధావన్, కరన్ క్రీజులో ఉన్నారు. ధావన్ కెరీర్ లో 50వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. లీగ్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన విషయానికొస్తే, ధావన్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచాడు.
పంజాబ్ కింగ్స్ 12.3 ఓవర్లలో 4 వికెట్లకు 106 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్, శామ్ కర్రాన్ ఉన్నారు. ధావన్ 47 పరుగులతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లలో మూడు వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేష్ శర్మ ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేస్తోన్న పంజాబ్ కింగ్స్ 8 ఓవర్లలో మూడు వికెట్లకు 70 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేష్ శర్మ ఉన్నారు.
లియామ్ లివింగ్‌స్టోన్ 15 పరుగుల వద్ద అవుటయ్యాడు. అతను వరుణ్ చక్రవర్తి చేతిలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు భానుక రాజపక్సే (0 పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (12 పరుగులు)లను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 8 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో కీపర్ గుర్భజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో భానుక రాజపక్సే తిరిగి వచ్చాడు. కోల్‌కతా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 5 గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పంజాబ్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి.
ఈ సీజన్‌లో కోల్‌కతా 10 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో కేవలం 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలోని 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్‌లో కోల్‌కతా, పంజాబ్‌లు రెండోసారి తలపడనున్నాయి.