KKR vs MI Score Highlights IPL 2021: కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబై ఇండియన్స్‌ విజయం

|

Apr 14, 2021 | 4:16 PM

KKR vs MI Live Score in Telugu: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు‌ విజయాన్ని దక్కించుకుంది. మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది.

KKR vs MI Score Highlights IPL 2021: కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబై ఇండియన్స్‌ విజయం
Ipl Kkr Vs Mi Match

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు‌ విజయాన్ని దక్కించుకుంది. మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. డెత్‌ ఓవర్లలో ముంబై కళ్లు చెదిరే బౌలింగ్‌తో అదరగొట్టింది.

అంతకు భారీ స్కోర్ అంచనాలను తలకిందులు చేసింది ముంబై ఇండియన్స్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్‌ తడబడింది. కేవలం యంగ్ హీరో సూర్య కుమార్‌ యాదవ్ ఒక్కడే కొంత మెరుపులు మెరిపించాడు. ‌(56/ 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై ఇండయన్స్ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ(43/ 32 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) కొంత వరకు రాణించాడు. అయితే అనుకున్నంతగా ఆడలేక పోయాడు.

ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబై భారీ స్కోరు చేయకుండా కోల్‌కతా బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ స్కోరు బోర్డ్‌ పరుగుకు అడ్డుకట్ట వేశారు. ఆండ్రీ రస్సెల్‌(5/15) ఐదు వికెట్లతో విజృంభించగా పాట్‌ కమిన్స్‌(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు అడ్డుకట్ట వేశారు.

టాస్‌ ఓడిన ముంబైకి పెద్దగా పరుగుల వరద కురవ లేదు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(2) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో డికాక్‌.. త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రసిధ్‌ కృష్ణ వేసిన 8వ ఓవర్లో యాదవ్‌ వరుసగా 6,4,4 బాది 16 రన్స్‌ సాధించాడు.

Key Events

కోల్‌కతా జట్టు:

నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), ఆండ్రూ రసెల్‌, దినేశ్‌ కార్తిక్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, పాట్‌ కమిన్స్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

ముంబై ఇండియన్స్ జట్టు:

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, మార్కో జాన్‌సెన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 Apr 2021 11:30 PM (IST)

    ముంబై ఇండియన్స్ విజయం..

    కోల్‌కతా జరిగిన రెండో టీ20లో ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ఓడిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ గెలిచాడు. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 142/7 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబయి 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

  • 13 Apr 2021 11:18 PM (IST)

    కోల్‌కతా విజయానికి 15 పరుగులు కావాలి

    బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. కార్తీక్‌(8), రసెల్‌(7) చెరో రెండు సింగిల్స్‌ తీశారు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి.

  • 13 Apr 2021 11:16 PM (IST)

    చివరి 3 బంతుల్లో 13 పరుగులు

    కోల్‌కతా చేతిలో ఉన్న మ్యాచ్‌లో దాదాపు ఓడిపోయింది. చివరి ఓవర్లో, ట్రెంట్ బోల్ట్ మొదటి రెండు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు మరియు మూడవ బంతికి రస్సెల్ ను క్యాచ్  ఇచ్చాడు. చివరి 3 బంతుల్లో 13 పరుగులు అవసరం.

  • 13 Apr 2021 11:15 PM (IST)

    2 ఓవర్లలో 19 పరుగులు

    కెకెఆర్‌కు చివరి 2 ఓవర్లలో 19 పరుగులు కావాలి, జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి బౌలింగ్‌లోకి వచ్చాడు. కార్తీక్, రస్సెల్ బౌండరీ పొందాలి.

  • 13 Apr 2021 11:08 PM (IST)

    18 బంతుల్లో 22 పరుగులు అవసరం..

    బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఓ నోబాల్‌ పడడంతో రసెల్‌ ఫ్రీహిట్‌ను(5) ఫోర్ కొట్టాడు. కార్తీక్‌(3) పరుగులతో కొనసాగుతున్నాడు. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి.

  • 13 Apr 2021 11:01 PM (IST)

    ఆండ్రీ రస్సెల్‌కు బిగ్ లైఫ్…

    ఆండ్రీ రస్సెల్ కు పెద్ద లైఫ్ దొరికింది. తన బంతికి వచ్చిన క్యాచ్‌ను క్రునాల్ పాండ్యా క్యాచ్  ఇచ్చాడు. ఈ వికెట్ పడిపోతే ముంబై ఈ మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంది. కెకెఆర్‌తోపాటు రస్సెల్ ఈ జీవితాన్ని ఇచ్చే ప్రయోజనాన్ని పొందాలి. జట్టుకు 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే అవసరంతోపాటు 5 వికెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి.

  • 13 Apr 2021 10:57 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ

    రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా తప్పుకున్నాడు. స్టోక్స్ చేతి వేలు  విరగడంతో ఇకపై టోర్నమెంట్‌లో ఆడలేడు. రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో ద్వారా క్యాచ్ తీసుకునేటప్పుడు అతను గాయపడ్డాడు. జోఫ్రా ఆర్చర్ లేకుండా రాజస్థాన్ ఇప్పటికే టోర్నమెంట్‌లోకి ప్రవేశించింది.

  • 13 Apr 2021 10:51 PM (IST)

    కోల్‌కతా పరుగుల వరదకు బ్రేక్.. షకిబ్ ఔట్..

    మ్యాచ్‌పై ముంబై ఇండియన్స్ పట్టు బిగిస్తోంది. కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టి కోల్‌కతా స్కోర్ బోర్డుకు బ్రేక్ వేసింది. కృనాల్‌ పాండ్య వేసిన 15.2 ఓవర్‌కు షకిబ్‌(9) ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా 122 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఇదే స్కోర్‌ వద్ద నితీశ్‌ రాణా(57) ఔటయ్యాడు.

  • 13 Apr 2021 10:44 PM (IST)

    నితీశ్‌ రాణా స్టంపౌట్

    15 ఓవర్లకు కోల్‌కతా 4వ వికెట్ కోల్పోయింది. రాహుల్‌ చాహర్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి నితీశ్‌ రాణా స్టంపౌటయ్యాడు. దీంతో కోల్‌కతా 122 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

  • 13 Apr 2021 10:38 PM (IST)

    కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది

    కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ చాహర్‌ వేసిన 10.3 ఓవర్‌కు రాహుల్‌ త్రిపాఠి(5) ఔటయ్యాడు. వికెట్ల వెనుక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆ జట్టు 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది.

  • 13 Apr 2021 10:37 PM (IST)

    కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం

    14వ ఓవర్‌ బౌలింగ్‌ వేసేందుకు వచ్చిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. తొలి బంతి విసరకముందే ఒక కాలు మడతపడడంతో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఫిజియో వచ్చి రోహిత్‌ పరిస్థితిని పరిశీలించాడు.

  • 13 Apr 2021 10:34 PM (IST)

    మోర్గాన్ ఔట్..

     రాహుల్‌ చాహర్‌ వేసిన ఐదో బంతికి మోర్గాన్‌(7) ఔటయ్యాడు. అతడాడిన షాట్‌ను మార్కో జాన్‌సెన్‌ క్యాచ్‌ అందుకోవడంతో కోల్‌కతా 104 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి షకిబ్‌ వచ్చాడు.

  • 13 Apr 2021 10:16 PM (IST)

    మరో సిక్సర్

    ప్రస్తుతానికి, ముంబై బౌలర్ ఎవరూ ప్రభావం చూపలేరు. ఈసారి రాహుల్ చాహర్ తన తొలి ఓవర్లో బౌండరీగా మార్చాడు. షుబ్మాన్ గిల్ ఓవర్ యొక్క మొదటి బంతిని లాగి ఒక ఫోర్ కొట్టాడు..  ఆపై చక్కటి సిక్సర్ చేశాడు.

  • 13 Apr 2021 10:14 PM (IST)

    ఫలించిన ముంబై ఇండియన్స్ పోరాటం..

    ఎట్టకేలకు ముంబైకి వికెట్ దక్కింది. రాహుల్‌ చాహర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో శుభ్‌మన్‌(33) ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. పొలార్డ్‌ చేతికి చిక్కడంతో కోల్‌కతా 72 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

  • 13 Apr 2021 10:12 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న నితీశ్, శుభ్‌మన్

    కృనాల్‌ పాండ్య వేసిన ఐదో ఓవర్‌లో నాలుగు పరుగులొచ్చాయి. నితీశ్‌(22), శుభ్‌మన్‌(8) ఆచితూచి ఆడుతున్నారు.

  • 13 Apr 2021 10:08 PM (IST)

    పనిచేయని పొలార్డ్ మంత్రం

    వికెట్ కోసం వెతుకుతున్న రోహిత్ శర్మ తన ‘మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్’ కైరాన్ పొలార్డ్‌ను బౌలింగ్  దించాడు. కాని ప్రస్తుతానికి అతను కూడా నితీష్ రానా బ్యాట్‌కు అడ్డుకట్ట వేయలేక పోతున్నాడు. రానా మొదట మిడ్ వికెట్ వద్ద ఒక సిక్సర్ కొట్టాడు, ఆపై బంతిని కవర్ల మీదుగా 4 పరుగులకు పంపాడు.

  • 13 Apr 2021 10:08 PM (IST)

    బౌండరీల వర్షం

    బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో రాణా(21), శుభ్‌మన్‌గిల్‌(7) చెరో బౌండరీ బాదారు.

  • 13 Apr 2021 09:56 PM (IST)

    క్రునాల్ పాండ్యా బౌలింగ్…

    క్రునాల్ పాండ్యా తన మొదటి ఓవర్‌ను చాలా పొదుపుగా వేశాడు. ఈ ఓవర్లో కెకెఆర్ ఓపెనర్లు పెద్ద షాట్‌ కొట్లలేదు. ముంబైకి ఇలాంటి గట్టి ఓవర్లు కావాలి.

  • 13 Apr 2021 09:53 PM (IST)

    నితీష్ దూకుడు

    బోల్ట్ రెండో ఓవర్ బాగా లేదు. బోల్ట్ చేసిన ఈ ఓవర్లో రానా కూడా ఒక ఫోర్ కొట్టాడు.  

  • 13 Apr 2021 09:51 PM (IST)

    బౌండరీతో కేకేఆర్ ఆట మొదలు

    బౌండరీతో కేకేఆర్ ఆట మొదలు పెట్టింది. టార్గెట్ రీచ్ అయ్యేందుకు బోణి కొట్టింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే నితీశ్‌ రాణా(4) బౌండరీ కొట్టాడు. శుభ్‌మన్‌గిల్‌(0) క్రీజ్‌లో  ఉన్నాడు.

  • 13 Apr 2021 09:15 PM (IST)

    19.5 ఓవర్లకు 152 పరుగులకు ఆటౌట్

    ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లకు 152 పరుగులకు ఆటౌటైంది. రసెల్‌ వేసిన చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్య‌(15) తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. తర్వాత మూడో బంతికి షాట్‌ ఆడబోయి ప్రసిద్ధ్‌ చేతికి చిక్కాడు. తర్వాతి బంతికే బుమ్రా(0), ఐదో బంతికి చాహర్‌(6) సైతం పెవిలియన్‌ చేరారు. దీంతో కోల్‌కతా లక్ష్యం 153గా నమోదైంది.

  • 13 Apr 2021 09:14 PM (IST)

    కె పాండ్యా ఔట్

    19 ఓవర్‌లో కె పాండ్యా (15) ఔటయ్యాడు. క్రునాల్ పాండ్యా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడంతో రస్సెల్స్ వేసిన చివరి ఓవర్‌లో దొరికిపోయాడు.   

  • 13 Apr 2021 09:03 PM (IST)

    జాన్సెన్ ఔట్

    ఎం జాన్సెన్ (0) ఆట ముగిసింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది ముంబై ఇండియన్స్. కమిన్స్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి మరో వికెట్ పడింది.

  • 13 Apr 2021 09:00 PM (IST)

    పోలార్డ్ ఔట్

    ముంబై ఇండియన్స్ కష్టాల్లోకి కూరుకుపోతోంది. దూకుడుగా ఆడుతాడు అనుకున్న పోలార్డ్ ఔటయ్యాడు. వికెట్ల వెనుక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబయి 125 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.

  • 13 Apr 2021 08:55 PM (IST)

    మరో కీలక వికెట్ పడింది

    భారీ షాట్ కోసం ప్రయత్నించిన పాండ్య 16వ ఓవర్‌లో రెండవ బంతికి దొరికిపోయాడు.

  • 13 Apr 2021 08:48 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్

    రోహిత్ శర్మ దూకుడుకు బ్రేక్ పడింది. కమిన్స్‌ వేసే బంతులకు ఆడేందుకు ప్రయత్నించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ తడబడ్డాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 119/4గా ఉంది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌శర్మను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 32బంతులాడిన రోహిత్‌ 3ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 43 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి పొలార్డ్‌ వచ్చాడు. మరో ఎండ్‌లో హార్దిక్‌ పాండ్య కొనసాగుతున్నాడు.

  • 13 Apr 2021 08:46 PM (IST)

    14 ఓవర్లకు 106 పరుగులు

    14 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు పూర్తి చేసింది. క్రీజులో రోహీత్‌ 36(27), హార్దిక్‌ 9(12) లతో ఉన్నారు

  • 13 Apr 2021 08:41 PM (IST)

    ముంబైకి 18 బంతుల తర్వాత బౌండరీ

    ముంబైకి 18 బంతుల తర్వాత మరో బౌండరీ లభించింది.ప్రసిధ్‌ కృష్ణ వేసిన ఓవర్‌లో మూడో బంతిని హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్టాడు. అంతకుముందు, సూర్యకుమార్  ఔట్ అయ్యే ముందు చివరి బౌండరీ వచ్చింది.

  • 13 Apr 2021 08:35 PM (IST)

    ముంబైని కట్టడి చేస్తున్న కోల్‌కతా

    కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముంబైని కట్టడి చేస్తున్నారు. కమిన్స్‌ వేసిన 12వ ఓవర్‌లో కేవలం 3 పరుగులే ఇచ్చారు. ఇదే ఓవర్‌లో ముంబై వికెట్‌ జారవిడుచుకుంది.

  • 13 Apr 2021 08:29 PM (IST)

    ముంబైకి మూడవ ఎదురుదెబ్బ.. ఇషాన్ కిషన్ ఔట్

    ముంబైకి కూడా మూడవ ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి, పాట్ కమ్మిన్స్ ఇషాన్ కిషన్‌ను తన కొత్త ఓవర్ తొలి బంతికే అవుట్ చేశాడు.

  • 13 Apr 2021 08:21 PM (IST)

    సూర్య కుమార్ ఔట్

    హాఫ్‌ సెంచరీ సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు. షకీబుల్‌ హసన్‌ వేసిన 11వ ఓవర్‌ మూడో బంతిని భారీషాట్‌కు ప్రయత్నించే క్రమంలో శుభ్‌మన్‌గిల్‌ చేతికి చిక్కాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ 36బంతుల్లో 56 పరుగులు చేశాడు. అందులో 7ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దూకుడుగా ఆడిన సూర్య కుమార్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

  • 13 Apr 2021 08:17 PM (IST)

    సూర్య మరోసారి మెరుపులు

    సూర్య మరోసారి మెరుపులు మెరిపించాడు. కమిన్స్‌ వేసిన పదో ఓవర్‌ ఐదో బంతిని భారీ సిక్సర్‌ కొట్టాడు. దీంతో 50 పరుగులు మార్కును పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 81/1గా ఉంది. క్రీజులో సూర్య(52), రోహిత్‌(25) ఉన్నారు.

  • 13 Apr 2021 07:55 PM (IST)

    సూర్య కుమార్ ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు…

    సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌ను కొనసాగిస్తున్నాడు. కేకేఆర్‌తో జరుగుతున్న రసవత్తర పోరులోనూ తన బ్యాట్‌కు పని చెబుతున్నాడు. హర్భజన్‌సింగ్‌ వేసిన మూడో ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్మూ డు ఫోర్లు కొట్టాడు.

  • 13 Apr 2021 07:53 PM (IST)

    మరో బౌండరీ

    వరుణ్‌ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగులు తీసింది. చివరి బంతికి రోహిత్‌ బౌండరీ కొట్టాడు.

  • 13 Apr 2021 07:44 PM (IST)

    మొదలైన ముంబై ఇండిన్స్ బ్యాటింగ్

    MI యొక్క బ్యాటింగ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మతో క్వింటన్ డికాక్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. అతని క్వారెంటన్ పూర్తికాకపోవడంతో డికాక్ చివరి మ్యాచ్‌లో ఆడలేదు. అయితే అదే సమయంలో హర్భజన్ సింగ్ కెకెఆర్ కోసం బౌలింగ్ మొదలు పెట్టాడు.  

  • 13 Apr 2021 07:40 PM (IST)

    తొలి వికెట్ పడింది

    ముంబై రెండో ఓవర్‌లోనే మొదటి వికెట్‌ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన క్వింటన్‌ డికాక్‌(2) ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన చివరి బంతికి షాట్‌ కొట్టబోయి త్రిపాఠి చేతికి చిక్కాడు. అంతకుముందు రోహిత్(8)‌ ఒక బౌండరీ బాదడంతో ఈ ఓవర్‌లో 7 పరుగులొచ్చాయి. క్రీజులోకి సూర్యకుమార్‌ వచ్చాడు.

  • 13 Apr 2021 07:39 PM (IST)

    తొలి బౌండరీ

    ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో బౌండరీలు మొదలయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన బౌలింగ్‌లో  రెండవ బంతిని లాగి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ  కొట్టాడు.

  • 13 Apr 2021 07:06 PM (IST)

    బౌలింగ్‌‌ ఎంచుకున్న కోల్‌కతా

    టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ముందుగా బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ముంబైని కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది.

  • 13 Apr 2021 06:59 PM (IST)

    గెలుపు నీదా.. నాదా..

    ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌తో ఎంఐ రెండు విజయవంతమైన జట్లు కావచ్చు. కానీ ఒకదానితో ఒకటి పోటీ విషయానికి వస్తే, ఈ రెండు జట్ల మధ్య చాలా ఏకపక్ష రికార్డులు కనిపించాయి. ముంబై ముందు కోల్‌కతా ఎక్కడా నిలబడదు.  జట్టు రికార్డు చాలా పేలవంగా ఉన్నాయి. ఇరు జట్ల చివరి 12 సార్లు పోటీ పడ్డాయి. ముంబై 11 సార్లు గెలిచింది. హెడ్-టు-హెడ్ రికార్డ్‌ను ఇక్కడ చూడండి-

Follow us on