KKR vs LSG Live Score:
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఈ గెలుపుతో (17 పాయింట్లు) లఖ్‌నవూ ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే నేరుగా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవవూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28; 27 బంతుల్లో), ప్రేరక్ మన్కడ్ (26; 20 బంతుల్లో), ఆయుష్ బదోని (25; 21 బంతుల్లో) పర్వాలేదనిపించగా.. చివర్లో నికోలస్ పూరన్ (58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.
The action soon shifts to Kolkata ?️@KKRiders face @LucknowIPL in Match 6️⃣8️⃣ of #TATAIPL 2023 ????
Who will win this gripping contest?#TATAIPL | #KKRvLSG pic.twitter.com/6xNfNmctGt
— IndianPremierLeague (@IPL) May 20, 2023
లక్నో సూపర్ జెయింట్స్(ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
4 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా టీం వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 22, రాయ్ 22 పరుగులతో క్రీజులో నిలిచారు.
177 పరుగుల ఛేజింగ్ మొదలుపెట్టిన కోల్‌కతా టీం.. తొలి ఓవర్‌లోనే ఆ మార్క్‌ను చూపించింది. వెంకటేష్ అయ్యర్ దూకుడుతో తొలి ఓవర్‌లోనే 15 పరుగులు రాబట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో 68వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్ 177 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. లక్నోలో నికోలస్ పూరన్ 30 బంతుల్లో 58 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
లక్నో 18.5 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది.
లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 123 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.
లక్నో 10.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
7 ఓవర్లు ముగిసేసరికి లక్నో టీం 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన కీలక పోరులో లక్నో టీమ్ తమ తొలి వికెట్ కోల్పోయింది. హర్షిత్ రానా వేసిన మూడో ఓవర్ 3వ బంతికి లక్నో ఓపెనర్ కరన్ శర్మ(3) పెవిలియన్ చేరాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన కరన్ మిడాన్‌లో శార్ధూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో 14 పరుగులు వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. కరన్ స్థానంలో ప్రేరక్ మన్కడ్ వచ్చాడు. మరోవైపు క్వింటన్ డికాక్(11) క్రీజులో ఉన్నాడు.
కోల్‌కతా తరఫున హర్షిత్ రానా వేసిన తొలి ఓవర్‌లో లక్నో టీమ్ ఒక రన్ మాత్రమే చేసింది. కరన్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే సింగిల్ తీయడంతో.. క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్ మిగిలిన 5 బంతులను ఆడాడు. అయితే డికాక్ ఎదుర్కొన్న ఆ 5 బంతులలో తన ఖాతా తెరవకుండానే ఉన్నాడు.
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా.. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్లు బ్యాటింగ్ చేయనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లక్నోకు చాలా ముఖ్యమైనది.