Kolkata Knight Riders vs Gujarat Titans Highlights in Telugu: రింకూ సింగ్ సిక్సర్ల విధ్వంసానికి గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్ మైదానంలో హార్దిక్ సేన కోల్ కతాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో విజయ్ శంకర్ (24 బంతుల్లో 51), మిల్లర్ (18 బంతుల్లో 32) ధాటిగా ఆడడంతో ఇంకా 13 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండోసారి ముఖాముఖి తలపడనున్నాయి. చివరిసారిగా ఈ జట్లు తలపడినప్పుడు రింకూసింగ్ 5 సిక్సర్ల విధ్వంసంతో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించింది. దీంతో గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని హార్ధిక్ సేన భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా తమ విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది. ఇరు జట్లలో స్టార్ బ్యాటర్లు, స్పిన్నర్లు, బౌలర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సో.. కోల్‌కతా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
Hello from Kolkata ?
Gearing up for an action-packed Super Saturday double-header ☀️@KKRiders face @gujarat_titans in Match 3️⃣9️⃣ of #TATAIPL 2023 ??
We witnessed a cracking game when these two sides faced last time. Who will emerge victorious in the #KKRvGT clash? ? pic.twitter.com/Uv3KN1teBz
— IndianPremierLeague (@IPL) April 29, 2023
గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంది. కోల్‌కతాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆజట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో విజయ్ శంకర్ (24 బంతుల్లో 51), మిల్లర్ (18 బంతుల్లో 32) ధాటిగా ఆడడంతో ఇంకా 13 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.
80 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ గిల్ (34 బంతుల్లో 49) మరొక అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అతనికి తోడుగా విజయ్ శంకర్ (0) క్రీజులో ఉన్నాడు. గుజరాత్ విజయానికి 54 బంతుల్లో 88 రన్స్ అవసరం
180 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ధాటిగా ఆడుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (25 బంతుల్లో 41, 8 ఫోర్లు ) కోల్ కతా బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ స్కోరు 7.3 ఓవర్లు ముగిసే సరికి 67/1. గిల్ కు తోడుగా హార్దిక్ (9) క్రీజులో ఉన్నాడు
కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (39 బంతుల్లో 81, 5ఫోర్లు, 7 సిక్స్‌లు) , ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్స్ లు ) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
— KolkataKnightRiders (@KKRiders) April 29, 2023
గుజరాత్ బౌలర్లు దూకుడు పెంచారు. భారీ స్కోరు దిశగా వెళుతున్న కోల్ కతాను కట్టడి చేశారు. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 15 ఓవర్లు ముగిసే సరికి 138/5. క్రీజులో రింకూసింగ్ (19), రస్సెల్ (1) ఉన్నారు.
Very ?????? room for error! ⚡
Josh bhai bags 2️⃣ big wickets! ??#AavaDe #KKRvGT #TATAIPL 2023 pic.twitter.com/YHxrzSiBm6
— Gujarat Titans (@gujarat_titans) April 29, 2023
.
కోల్‌కతా ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (27 బంతుల్లో 51, 4ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా వెంకటేశ్ అయ్యర్ (10) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 10 ఓవర్లు ముగిసే సరికి 84/2
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (20 బంతుల్లో 43, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ దిశగా పయనిస్తున్నాడు.
Mohit Sharma you beauty ??
A remarkable catch running backwards to dismiss Shardul Thakur ????#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH
— IndianPremierLeague (@IPL) April 29, 2023
వర్షం నిలవడంతో కోల్ కతా- గుజరాత్ మ్యాచ్ ప్రారంభమైంది. ఓవర్ల కోత లేకుండానే మ్యాచ్ ప్రారంభమైంది. 45 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పూర్థి స్థాయిలో 20 ఓవర్ల మ్యాచ్ జరగనుందని అంపైర్లు ప్రకటించారు.
? Update from Kolkata ?
Play to start at 4:15 PM IST, no overs lost ✅
Follow the match ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT
— IndianPremierLeague (@IPL) April 29, 2023
టాస్ ముగిసిన తర్వాత కోల్‌కతాలో భారీ వర్షం ప్రారంభమైంది, దీని కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం ఆగిపోయినా ఆకాశంలో మేఘాలు మాత్రం అలాగే ఉన్నాయి. త్వరలోనే మ్యాచ్ పై అప్డేట్ రానుంది.
కోల్ కతా
సుయాశ్ శర్మ, మన్‌దీప్ సింగ్, అంకుల్ రాయ్, టిమ్ సౌథి, కుల్వంత్ కేజ్రోలియా,
గుజరాత్
శుభమన్ గిల్, శ్రీకర్ భరత్, సాయి కిశోర్, శివమ్ మావి, జయంత్ యాదవ్
KKR:
నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రహ్మనుల్లా గుర్బాజ్, నారాయణ్ జగదీషన్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వీసా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్
GT:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్) వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్, నూర్ అహ్మద్
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కోల్‌కతాను ముందుగా బ్యాటింగ్‌కు పిలిచింది. కాగా ఈ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.