KKR Player Release : కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం..భరించలేమంటూ రూ.24కోట్ల ప్లేయర్‎కు గుడ్ బై

2026 మినీ-ఆక్షన్ ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గత మెగా ఆక్షన్‌లో 23.75 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‎ను ఆ జట్టు విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

KKR Player Release : కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం..భరించలేమంటూ రూ.24కోట్ల ప్లేయర్‎కు గుడ్ బై
Venkatesh Iyer

Updated on: Nov 15, 2025 | 8:48 AM

KKR Player Release : 2026 మినీ-ఆక్షన్ ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గత మెగా ఆక్షన్‌లో 23.75 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‎ను ఆ జట్టు విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజా వార్తల ప్రకారం, ఈ నిర్ణయం వెనుక గతేడాది అతని పేలవమైన ప్రదర్శన ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

23.75 కోట్ల ప్లేయర్‌ను రిలీజ్ చేస్తున్న KKR

ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వెంకటేష్ అయ్యర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. 2021 నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్న అయ్యర్‌ను విడుదల చేసినప్పటికీ, ఆక్షన్‌లో తక్కువ ధరకు మళ్లీ కొనుగోలు చేయాలని కేకేఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్‌తో పాటు, క్వాంటన్ డి కాక్, ఎన్రిక్ నార్ట్జే వంటి ఇతర ఆటగాళ్లను కూడా కేకేఆర్ విడుదల చేసే అవకాశం ఉందని వదంతులు వినిపిస్తున్నాయి.

రిలీజ్‌కు కారణం పేలవమైన ప్రదర్శనే

గత మెగా ఆక్షన్‌లో కేకేఆర్ పట్టుబట్టి మరీ వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఆ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడినా, కేకేఆర్ అత్యధిక మొత్తానికి అతన్ని కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌లో అయ్యర్ ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. అతను ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఆటగాడి నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోవడంతో, అతన్ని విడుదల చేయాలని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

పర్స్‌పై భారీ ప్రభావం, కెప్టెన్సీ ఎంపికపై దృష్టి

వెంకటేష్ అయ్యర్‌ను విడుదల చేయడం ద్వారా కేకేఆర్ జట్టు పర్స్‌లో ఏకంగా రూ.23.75 కోట్ల భారీ మొత్తం తిరిగి చేరుతుంది. ఈ డబ్బుతో జట్టు ఆక్షన్‌లో ఇతర కీలక ఆటగాళ్లను లేదా కెప్టెన్సీ ఎంపికలను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. గత సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్సీ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అప్పట్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా రిలీజ్ చేసి, తర్వాత తొలి రౌండ్‌లో అమ్ముడుపోని అజింక్యా రహానేను కెప్టెన్‌గా నియమించారు. అందుకే ఈసారి కేకేఆర్ కెప్టెన్సీకి ఎక్కువ ఎంపికలు ఉండేలా చూసుకోవాలి.

గౌతమ్ గంభీర్ అభిప్రాయం

వెంకటేష్ అయ్యర్ ఇటీవల మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశిస్తారని చెప్పాడు. సాధారణ ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లు గంభీర్‌తో కలిసి పనిచేయడం కష్టమని కూడా అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ఈ కామెంట్‌ను బట్టి చూస్తే, అయ్యర్ పేలవమైన ప్రదర్శన అతన్ని రిలీజ్ చేయడానికి ఒక కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..