
మొహాలి: మొహాలి వేదికగా కింగ్స్ xi పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఇరు జట్లకూ ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటికే రెండేసి మ్యాచులు గెలిచిన ఈ రెండు జట్లు మూడో విజయం కోసం పట్టుదలగా కనిపిస్తున్నాయి.