Pollard hits six sixes: పొలార్డ్​ ఊచకోత.. 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యూవీ, హర్షెల్లే గిబ్స్ సరసన…

|

Mar 04, 2021 | 9:53 AM

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్బుతం చేశాడు.  ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లతో విరుచుకుపడ్డాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధనంజయ వేసిన

Pollard hits six sixes: పొలార్డ్​ ఊచకోత.. 6  బంతుల్లో 6 సిక్సర్లు.. యూవీ, హర్షెల్లే గిబ్స్ సరసన...
ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లు.
Follow us on

Kieron Pollard : వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్బుతం చేశాడు.  ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లతో విరుచుకుపడ్డాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధనంజయ వేసిన ఆరో ఓవర్​లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. టీ20ల్లో విండీస్​ తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొలిపాడు.  మ్యాచ్​లో వెస్టిండీస్​ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. విండీస్​ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 131/9 పరుగులకే శ్రీలంక చేతులెత్తేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన విండీస్​ను ఆరంభంలోనే ధనంజయ బెదరగొట్టాడు. నాలుగో ఓవర్​లో క్రిస్ గేల్ వికెట్​ సహా హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. అయితే జేసన్ హోల్డర్​తో కలిసి పొలార్డ్​ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతర్జాతీయ క్రికెట్​లో ఒకే ఓవర్​లో ఆర్​ సిక్సర్​లు బాదిన మూడో క్రికెటర్​ పొలార్డ్. అంతకుముందు ఈ ఘనత 2007లో ఇంగ్లాండ్​పై యువరాజ్​ సింగ్​, 2017లో నెదర్​లాండ్స్​పై హర్షెల్లే గిబ్స్​ సాధించారు.

యువరాజ్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకం:

యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది వరసగా 6 బంతుల్లో 6 సిక్సర్లే.  2007 టీ20 ప్రపంచకప్‌‌లో సెప్టెంబర్‌ 19, 2007న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అసలైన టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు ఆరోజున చూపించాడు యూవీ. డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ టీమ్.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో ఉంది. ఈ సమయంలో క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో దాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ హద్దు మీరి ప్రవర్తించాడు. దాంతో.. యూవీ కూడా మాటలతో అదే స్థాయిలో కౌంటరిచ్చాడు. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లు, తోటి ప్లేయర్స్ జోక్యం దూరంగా వెళ్లిపోయారు. తన కోపాన్ని కేవలం మాటలకే పరిమితం చేయలేదు యూవీ. తరువాతి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ బంతులపై చూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 ప్రపంచక‌ప్‌లో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ రీచ్ అయ్యాడు.

Also Read:

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు