Surya Kumar Yadav : అర్థరాత్రి నాకు మెసేజ్‌లు వచ్చేవి..సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Surya Kumar Yadav : టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతంలో తనకు మెసేజ్‌లు చేసేవాడంటూ నటి ఖుషీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పబ్లిసిటీ స్టంట్‌ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్ల పై పలువురు నెటిజన్లు మెసేజ్ చేస్తున్నారు.

Surya Kumar Yadav : అర్థరాత్రి నాకు మెసేజ్‌లు వచ్చేవి..సూర్యకుమార్ యాదవ్‌పై  హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
Surya Kumar Yadav

Updated on: Dec 30, 2025 | 3:03 PM

Surya Kumar Yadav : సినిమా స్టార్లకు, క్రికెటర్లకు మధ్య ఏదో ఒక లింక్ ఉండటం సహజమే. కానీ, తాజాగా ఒక నటి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తన బోల్డ్ లుక్స్‌తో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి ఖుషీ ముఖర్జీ, సూర్య తనకి మెసేజ్‌లు చేసేవాడంటూ బాంబు పేల్చింది.

సూర్య గురించి ఖుషీ ఏమందంటే?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ ముఖర్జీకి క్రికెటర్ల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. చాలామంది క్రికెటర్లు తనతో టచ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తారని, గతంలో సూర్యకుమార్ యాదవ్ కూడా తనకు తరచుగా మెసేజ్‌లు చేసేవాడని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం తనకి సూర్యకి మధ్య ఎలాంటి సంబంధం లేదని, అసలు ఎవరితోనూ లింక్-అప్ పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని ఖుషీ స్పష్టం చేసింది. అనవసరమైన రూమర్లు వస్తాయనే ఉద్దేశంతోనే తాను ఎవరితోనూ మాట్లాడటం లేదని ఆమె చెప్పుకొచ్చింది.

ఎవరీ ఖుషీ ముఖర్జీ?

కోల్‌కతాకు చెందిన ఖుషీ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో పాటు దొంగ ప్రేమ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా టీవీ రియాలిటీ షోల ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఎమ్‌టీవీలో వచ్చే స్ప్లిట్స్‌విల్లా 10, లవ్ స్కూల్ 3 వంటి షోలలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత బాల్వీర్ రిటర్న్స్ వంటి సీరియళ్లలోనూ నటించి మెప్పించింది.

నెటిజన్ల ఫైర్ – పబ్లిసిటీ స్టంటేనా?

ఖుషీ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ అని, అలాంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడానికి ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్న గిమ్మిక్కు అని కొందరు కొట్టిపారేస్తుంటే, నిజంగానే సూర్య మెసేజ్ చేశాడా? అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఖుషీ తన బోల్డ్ వెబ్ సిరీస్‌ల వల్ల పలుమార్లు ట్రోలింగ్‌కు గురైంది. ఏదేమైనా ఇప్పుడు స్కై పేరును లాగడంతో ఈ ఇష్యూ నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..