Kavya Maran: వరుసగా రెండోసారి విజేతగా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్యాపాప.. సెలబ్రేషన్ వీడియో చూశారా?

|

Feb 11, 2024 | 9:10 AM

Sunrisers Eastern Cape: DSG స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్ ఫైనల్ మ్యాచ్‌లో తన ఖాతాను తెరవలేకపోయాడు. ఒట్నియల్ బార్ట్‌మన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. సూపర్ జెయింట్స్ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా మారింది. సన్‌రైజర్స్ తరపున ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లతో మెరిశాడు.

Kavya Maran: వరుసగా రెండోసారి విజేతగా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్యాపాప.. సెలబ్రేషన్ వీడియో చూశారా?
Kavya Maron Sa20 Video
Follow us on

Sunrisers Eastern Cape Champion In SA20: దక్షిణాఫ్రికా ట్వంటీ 20 రెండో ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్‌జెయింట్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం (ఫిబ్రవరి 10) న్యూలాండ్స్, కేప్ టౌన్‌లో జరిగిన టైటిల్ డిసైడర్‌లో ఆరెంజ్ ఆర్మీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టామ్ అబెల్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (56*) అర్ధ సెంచరీలతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్‌ 17 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.

DSG స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్ ఫైనల్ మ్యాచ్‌లో తన ఖాతాను తెరవలేకపోయాడు. ఒట్నియల్ బార్ట్‌మన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. సూపర్ జెయింట్స్ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా మారింది. సన్‌రైజర్స్ తరపున ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లతో మెరిశాడు.

సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్ కూడా SA20 2024 ఫైనల్‌ను వీక్షించేందుకు సౌతాఫ్రికా వెళ్లారు. ఆమె తన జట్టు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మారన్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. “ఇది రెండవ కప్పు. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవడం గొప్ప విషయం. మా జట్టు బ్యాట్, బంతితో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ మొత్తం సీజన్‌లో మేం ఆధిపత్యం చెలాయించాం. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవడం అపురూపం. అందరు చాలా సంతోషించారు. అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈరోజు ఆడిన అత్యంత బలమైన జట్టు మాది. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కావ్య మారన్ అన్నారు.

SA20 2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కప్ గెలిచిన తర్వాత కావ్య సంతోషం..

SA20 2024 లీగ్ స్థాయి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ అగ్రస్థానంలో ఉంది. ఫిబ్రవరి 6న, కేశవ్ మహారాజ్ నేతృత్వంలోని డర్బన్ సూపర్‌జెయింట్‌తో జరిగిన బలమైన ప్రదర్శనతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. ఫైనల్లో కూడా సన్‌రైజర్స్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి చిరస్మరణీయ విజయంతో టైటిల్‌ను నిలబెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..