India vs England: ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. ఇద్దరు మెరుగైన ఆటగాళ్లు జట్టులోకి.. ఎవరంటే..?

|

Sep 08, 2021 | 3:56 PM

India vs England: ఓవల్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు మొదలయ్యాయి. మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు ముందు ఇద్దరు ఆటగాళ్లను

India vs England: ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. ఇద్దరు మెరుగైన ఆటగాళ్లు జట్టులోకి.. ఎవరంటే..?
India Vs England
Follow us on

India vs England: ఓవల్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు మొదలయ్యాయి. మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు ముందు ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. వీరిలో జోస్ బట్లర్, జాక్ లీచ్ ఉన్నారు. బట్లర్ బిడ్డ పుట్టిన కారణంగా నాలుగో టెస్టులో ఆడలేదు. మరోవైపు ఎడమ చేతి స్పిన్నర్ జాక్ లీచ్ ఈ సిరీస్‌లో మొదటిసారి ఇంగ్లాండ్ జట్టులో భాగమయ్యాడు. సెప్టెంబర్ 10 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. విరాట్ కోహ్లీ జట్టు లార్డ్స్, ఓవల్‌లో టెస్టుల్లో విజయం సాధించింది. హెడింగ్లీలో జో రూట్ నేతృత్వంలోని జట్టు గెలిచింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది.

ఇంగ్లాండ్ జట్టు గురించి చెప్పాలంటే.. బట్లర్ మూడో టెస్టు తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. అతని భార్య అప్పుడు డెలీవరీకి ఉండటంతో జట్టు నుంచి వైదొలిగాడు. కానీ ఇప్పుడు అతను మళ్లీ జట్టులో చేరాడు. మాంచెస్టర్ గ్రౌండ్‌లో బట్లర్‌కు మంచి రికార్డు ఉంది. అతను ఇక్కడ తన చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 180 పరుగులు చేశాడు. 67, 38, 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను మూడుసార్లు 100 కంటే ఎక్కువ బంతులను ఎదుర్కొన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి చోటు లభిస్తుందో లేదో చూడాలి. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్ కీపర్ బాధ్యతను జానీ బెయిర్‌స్టోకు అప్పగించింది.

అలాగే జాక్ లీచ్ జట్టులోకి రావడంతో మొయిన్ అలీని భర్తీ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది భారత పర్యటనలో అహ్మదాబాద్ టెస్టులో లీచ్ చివరిగా ఇంగ్లాండ్ కోసం ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టు నుంచి బయటే ఉన్నాడు. 30 ఏళ్ల జాక్ లీచ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడాడు 62 వికెట్లు తీసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 83 పరుగులకు ఐదు వికెట్లు. మోయిన్ అలీ హెడింగ్లీ, ఓవల్ టెస్టుల్లో ఆడాడు కానీ అతను అద్భుతాలు ఏం చేయలేకపోయాడు.

ఇంగ్లాండ్ జట్టు
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, ఒల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, డేన్ లారెన్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఎవర్టన్, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, సామ్ కర్రాన్, జాక్ లీచ్.

Viral Photos: ఈ చెట్టు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పొడవైనది..! చూస్తే ఆశ్చర్యపోతారు..

Assembly on CAA: సీఏఏ రద్దు చేయాలి.. తీర్మానం చేసిన తమిళనాడు శాసనసభ

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధులకు పండుగంటే చాలు.. గుండెలదురుతున్నాయట.!