IPL 2022: హైదరాబాద్‌, పంజాబ్ మ్యాచ్‌లో DRS వివాదం.. ఎల్బీడబ్ల్యూకు రివ్యూ తీసుకుంటే..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ (PBKS vs SRH) మధ్య మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌కు సంబంధించి వివాదం తలెత్తింది...

IPL 2022: హైదరాబాద్‌, పంజాబ్ మ్యాచ్‌లో DRS వివాదం.. ఎల్బీడబ్ల్యూకు రివ్యూ తీసుకుంటే..
Srh

Updated on: Apr 17, 2022 | 6:14 PM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ (PBKS vs SRH) మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ వివాదం తలెత్తింది. హైదరాబాద్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌(Kane Williamson) రివ్యూ తీసుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow) అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఎందుకంటే విలియమ్సన్‌ చివరి సెకండ్‌లో DRS రివ్యూ తీసుకున్నాడు. విలియమ్సన్ 15 సెకన్ల సమయంలో జీరో సెకన్‌లో DRS తీసుకున్నాడు. దీనిని పంజాబ్ కింగ్స్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో వ్యతిరేకించాడు. అయితే అంపైర్ హైదరాబాద్‌ను రివ్యూ తీసుకోవడానికి అనుమతించాడు. విలియమ్సన్ చేసిన ఈ రివ్యూ హైదరబాద్‌కు అనుకూలంగా వచ్చింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ఔట్ అని రివ్యూలో తేలింది.

ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేస్తే

అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకర ఘటన జరిగింది. నటరాజన్‌ ఐదో ఓవరు బౌలింగ్ చేశాడు. ఈ ఓవరు ఐదో బంతిని పంజాబ్ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్‌ ఆడే ప్రయత్నంలో బంతి.. ప్యాడ్స్‌ను తాకి కీపర్‌ పూరన్‌ చేతిలోకి వెళ్లింది. దీనిపై సందిగ్ధంలో ఉన్న హైదరాబాద్ కెప్టెన్‌ విలియమ్సన్‌ చివిరి క్షణంలో ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకున్నాడు. అయితే రివ్యూలో బంతి బ్యాట్‌కు తాకినట్లు తేలింది. బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలిందని తేలింది. ఈ బంతి వికెట్ వెనుక నికోలస్ పూరన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకుంటే క్యాచ్‌ ఔట్అని ఫలితం వచ్చింది.

Read Also.. Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్ మళ్లీ చెలరేగాడు.. ఆ బంగ్లాదేశ్ బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు..!