Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం

|

Jun 26, 2021 | 2:27 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం
Mohammad Azharuddin And John Manoj
Follow us on

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ ఇవి మరింతగా పెరుగుతుండడంతో ఏం జరుగుతుందో తెలియడంలేదు. తాజాగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ఎన్నుకుంది. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ ఓ లేఖను విడుదల చేసింది. ప్రస్తుతం జాన్ మనోజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అజారుద్దీన్ పై సస్పెషన్ వేటు వేసిన అపెక్స్ కౌన్సిల్.. ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకున్నారన్న అభియోగాల నేప‌థ్యంలో ఈ నోటీస్ జారీ చేశారు.

అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండ‌డంతో హెచ్‌సీఏ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులపై స్పందించిన ఆపెక్స్ కౌన్సిల్‌ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం 5గురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి ఇదంతాచేస్తున్నారని మండిపడ్డారు. వారు చేసిందే అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏ లో జరుగుతున్న.. అలాగే ఇదివరకు జరిగిన అవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన ఓ వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే.. ఈ వర్గమే తప్పు పట్టిందని, దానికి కారణం వాళ్ల తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయపడుతున్నారుని ఆరోపించారు. అందుకే నాపై కక్ష్య కట్టి ఇలా చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయం మరింత వివాదాన్ని రాజేసింది. మరోవైపు ఈ విషయాన్ని బీసీసీఐతో చర్చిస్తానని పేర్కొన్నారు. అయితే బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, హెచ్‌సీఏ లో జరుగుతున్న గొడవలపై అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, హెచ్‌సీఏలో ముదురుతున్న గొడవలతో.. అసోసియేషన్‌లో ఉన్న ఆటగాళ్లంతా అయోమయంలో ఉన్నారు. వివాదాలతో హెచ్‌సీఏ పేరు మసకబారిపోతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన వివాదాలకు స్వస్తి చెప్పి పాలనపై శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు.

Also Read:

Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్‌ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా స్టార్ షట్లర్ పీవీ సింధు..!

T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్