
Jasprit Bumrahs Wife Sanjana Ganesan: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన 45వ మ్యాచ్ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా కుమారుడు అంగద్ బుమ్రా వైరల్ ఫుటేజీని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో మ్యాచ్ మరుసటి రోజు సంజన గణేషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని పంచుకుంది. అందులో ఆమె తన కొడుకును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వ్యక్తిని హెచ్చరించింది.
మ్యాచ్ తర్వాత అంగద్ గురంచి కొన్ని వీడియోలు షేర్ అయ్యాయి. ఈ కొన్ని సెకన్ల వీడియో ఆధారంగా అంగద్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని సంజన గణేషన్ తీవ్రంగా వాపోయింది. అలా చేయడం మానేయాలని కోరింది. ఈమేరకు సంజన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకుంది. “మా కొడుకు మీ వినోదానికి సంబంధించిన విషయం కాదు. ఇంటర్నెట్ ఒక చెత్త ప్రదేశం. కాబట్టి అంగద్‌ను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడానికి జస్ప్రీత్, నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కెమెరాలతో నిండిన క్రికెట్ స్టేడియంలోకి పిల్లవాడిని తీసుకురావడం వల్ల కలిగే చిక్కులను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను, జస్ప్రీత్ మా బాబుకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే ఉన్నామని అర్థం చేసుకోండి” అంటూ హెచ్చరించింది.
“మా కొడుకు వైరల్ ఇంటర్నెట్ కంటెంట్ లేదా జాతీయ వార్తల్లో రావడం ఆసక్తి లేదు. అక్కడ అనవసరంగా అభిప్రాయాలున్న కీబోర్డ్ యోధులు 3 సెకన్ల ఫుటేజ్ నుంచి అంగద్ ఎవరు, అతని సమస్య ఏమిటి, అతని వ్యక్తిత్వం ఏమిటి అని నిర్ణయిస్తున్నారు. అతను ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడు. ఒక పిల్లవాడిని ఉద్దేశించి నీచమైన పదాలను ఉపయోగించడం తప్పు. ఇది నిజంగా విచారకరం. మీకు మా కొడుకు గురించి ఏమీ తెలియదు, మా జీవితాల గురించి ఏమీ తెలియదు, కానీ మా గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. నేటి ప్రపంచంలో నిజాయితీ, దయ కరువైంది” అంటూ సంజన వాపోయింది.
ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం గమనార్హం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..