India Vs South Africa: పట్టుబిగించిన టీమిండియా.. సఫారీల టార్గెట్ 305

|

Dec 29, 2021 | 6:15 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(34), కెఎల్ రాహుల్(23)...

India Vs South Africa: పట్టుబిగించిన టీమిండియా.. సఫారీల టార్గెట్ 305
Ind Vs Sa
Follow us on

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(34), కెఎల్ రాహుల్(23), రహనే(18) పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, జాన్సెన్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. ఎనిగిడి 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌‌తో కలిపి భారత్‌కు 304 పరుగుల ఆధిక్యం దక్కింది. దీనితో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సఫారీలు 305 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్‌ 10 వికెట్లు పడగొట్టాలి.

అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాను ఎనిగిడి 6 వికెట్లు తీసి.. రబాడా 3 వికెట్లు తీసి వెన్ను విరిచాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి 5 వికెట్లు, శార్దుల్‌ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, చెరో వికెట్ పడగొట్టారు.