W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన దమ్మున్నోడు..

Akib Nabi's Double Hattrick: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అకిబ్ నబీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈస్ట్ జోన్ జట్టును కేవలం 230 పరుగులకే ఆలౌట్ చేయడంలో నబీ కీలక పాత్ర పోషించాడు.

W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన దమ్మున్నోడు..
Akib Nabi Double Hattrick

Updated on: Aug 30, 2025 | 6:51 AM

Akib Nabi’s Double Hattrick: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ (Duleep Trophy) క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో 4 జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 405 పరుగులకు ముగించింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ జట్టు కేవలం 230 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 175 పరుగుల వెనుకంజలో నిలిచింది. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ ఈస్ట్ జోన్ జట్టును ఇంత తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అకిబ్ కేవలం 28 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. దీంతో, దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

హ్యాట్రిక్ వికెట్..

53వ ఓవర్ వేయడానికి వచ్చిన ఆకిబ్ నబీ, ఈ ఓవర్ నాల్గవ బంతికి విరాట్ సింగ్‌కు పెవిలియన్ దారి చూపించాడు. తరువాత వచ్చిన మనీషిని కూడా మొదటి బంతికి అవుట్ చేశాడు. చివరి బంతికి ముక్తార్ హుస్సేన్‌ను అవుట్ చేయడం ద్వారా అతను తన తొలి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. మళ్ళీ 55వ ఓవర్ వేయడానికి వచ్చిన ఆకిబ్, మొదటి బంతికే సూరజ్ సింధు జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు..

ఇది వరుసగా నాలుగు బంతుల్లో అతని నాలుగో వికెట్. దీంతో, అతను డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. నిజానికి, క్రికెట్‌లో, వరుసగా మూడు వికెట్లు తీయడాన్ని హ్యాట్రిక్ అంటారు. వరుసగా నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. నబీ చేసిన ఈ డేంజరస్ దాడి కారణంగా, తూర్పు జోన్ జట్టు చివరి 5 వికెట్లు కేవలం 8 పరుగులకే పడిపోయాయి. ఈ మ్యాచ్‌లో ఆకిబ్ నబీ కాకుండా, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసుకోగా, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

దులీప్ ట్రోఫీలో వరుసగా నాలుగు వికెట్లు తీసిన తొలి ఆటగాడు ఆకిబ్ నబీ. భారత ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో, వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత నాలుగు సార్లు మాత్రమే జరిగింది. 1988లో హిమాచల్ ప్రదేశ్‌పై ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ. అతని తర్వాత, 2018లో, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మహ్మద్ ముధాసిర్, మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్వంత్ ఖేజ్రోలియా ఈ ఘనతను సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..