కొంతమంది క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో అల్లాడిస్తే.. మరికొందరు డొమెస్టిక్ క్రికెట్‌లో రఫ్ఫాడిస్తారు.ఆ కోవకు చెందిన ప్లేయరే జేమ్స్ విన్స్(James Vince). ఈ 30 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆడింది తక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు అయినప్పటికీ.. డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడటంలో అపార అనుభవం ఉంది. తాజాగా జరుగుతోన్న టీ20 విటాలిటీ బ్లాస్ట్‌లో జేమ్స్ విన్స్ చెలరేగి ఆడుతున్నాడు. వరుసపెట్టి తుఫాన్ ఇన్నింగ్స్‌లు కొడుతూ ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
ఇటీవల హాంప్‌షైర్, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విన్స్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సోమర్‌సెట్ జట్టు నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హంప్‌షైర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ విన్స్.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టడమే కాకుండా.. జట్టుకు కావాల్సిన భారీ స్కోర్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 62 బంతులు ఎదుర్కొన్న విన్స్ 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 208.60. అంతేకాకుండా బౌండరీల రూపంలో విన్స్ కేవలం 19 బంతుల్లోనే 96 పరుగులు రాబట్టాడు. తాజాగా చేసిన సెంచరీతో విన్స్ టీ20లో 8000 పరుగులు పూర్తి చేశాడు. మరోవైపు హాంప్‌షైర్ జట్టులో కెప్టెన్ విన్స్(129), టామ్ ప్రెస్ట్(62) తప్పితే.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కూడా రెండంకెల స్కోర్ దాటలేదు.
What a night for the skipper…
Highest T20 score for Hampshire ?
8️⃣0️⃣0️⃣0️⃣ Career T20 runs ?
2️⃣4️⃣,0️⃣0️⃣0️⃣ Career runs ?Captain, Leader, Legend. pic.twitter.com/dQRZW6N7Jn
— Hampshire Hawks (@hantscricket) June 23, 2022
209 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన సోమర్‌సెట్‌కు మొదటి ముగ్గురు బ్యాటర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. స్నీడ్(43), బాంటన్(54), రోసోవ్(55) తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. అయితే వీరి తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 9 వికెట్లు నష్టానికి 194 పరుగులు చేయగలిగింది. దీనితో హంప్‌షైర్ 14 పరుగులతో విజయాన్ని సాధించింది.