IPL 2021 Auction: సురేశ్ రైనా రాక జట్టుకు మరింత ఊరట.. చెన్నై జట్టుకు సూచనలిస్తున్న టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్..

|

Feb 17, 2021 | 8:57 AM

IPL 2021 Auction : మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్‌ వేలం జరుగుతున్న నేపథ్యంలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్న చెన్నై జట్టుకు టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్

IPL 2021 Auction: సురేశ్ రైనా రాక జట్టుకు మరింత ఊరట.. చెన్నై జట్టుకు సూచనలిస్తున్న టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్..
Follow us on

IPL 2021 Auction : మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్‌ వేలం జరుగుతున్న నేపథ్యంలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్న చెన్నై జట్టుకు టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పలు సూచనలు చేస్తున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన షేన్‌ వాట్సన్‌, వయసు మీద పడుతున్న డ్వేన్‌ బ్రావో స్థానాలను భర్తీచేయగల ఆటగాళ్లను చెన్నై సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేయాల్సి ఉందని గుర్తుచేశాడు.

గతేడాది సురేశ్‌ రైనా లేడు కనుక ఈసారి అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఐపీఎల్‌ తిరిగి భారత్‌కు రావడంతో ఎంఎస్‌ ధోనీ జట్టులో మరికొన్ని మార్పులు చేసేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నాడు. చెపాక్‌ మందకొడి పిచ్‌ కనుక బంతి ఎక్కువగా టర్న్‌ అవుతుంది. హర్భజన్‌ను విడుదల చేయడంతో ఈసారి ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. అలాగే ఒక ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా చెన్నైకి ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఓపెనింగ్‌ చేస్తారు కనుక మరో బ్యాటర్‌ను తీసుకోవచ్చని సూచించాడు. ఈ సీజన్లో వేలం చిన్నదే కనుక జట్టును తక్కువ మందికే పరిమితం చేయాలని గంభీర్‌ చెప్పాడు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  దిగువన చూడండి..