అంపైర్ల పొరబాట్లు.. కివీస్ కన్నీరు!

|

Jul 15, 2019 | 6:28 PM

లండన్: ప్రపంచకప్ 2019లో లీగ్ స్టేజి నుంచి.. ఫైనల్ వరకు అంపైర్ల పొరబాట్లు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్‌లో అంపైర్ తప్పిదం వల్ల కివీస్‌కు వరల్డ్‌కప్ చేజారిపోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకడంతో అది కాస్తా బౌండరీకి వెళ్ళిపోయింది. దీనితో అంపైర్లు 6 పరుగులుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వల్లే కివీస్‌కు ప్రపంచకప్ గల్లంతైందని అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ […]

అంపైర్ల పొరబాట్లు.. కివీస్ కన్నీరు!
Follow us on

లండన్: ప్రపంచకప్ 2019లో లీగ్ స్టేజి నుంచి.. ఫైనల్ వరకు అంపైర్ల పొరబాట్లు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్‌లో అంపైర్ తప్పిదం వల్ల కివీస్‌కు వరల్డ్‌కప్ చేజారిపోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకడంతో అది కాస్తా బౌండరీకి వెళ్ళిపోయింది. దీనితో అంపైర్లు 6 పరుగులుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వల్లే కివీస్‌కు ప్రపంచకప్ గల్లంతైందని అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్‌గా లెజెండరీ అంపైర్ సైమన్ టాఫుల్ కూడా అంపైర్లు నిర్ణయం ఖచ్చితంగా తప్పేనని తేల్చి చెప్పాడు. ఐసీసీ రూల్స్… ఆర్టికల్ 19.8 ప్రకారం 5 రన్స్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశాడు. అటు సూపర్ ఓవర్‌లో కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం సరికాదని మాజీ క్రికెటర్లు దుయ్యబడుతున్నారు.