IPL 2022 Retention: ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయంపై స్పందించిన ఉతప్ప.. ధావన్‎ను రిటైన్ చేసుకోకపోవడంపై ఆశ్చర్యం..

IPL 2022 మెగా వేలానికి ముందు 8 ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురిని రిటైన్ చేసుకుంది. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జేలను కొనసాగించింది...

IPL 2022 Retention: ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయంపై స్పందించిన ఉతప్ప.. ధావన్‎ను రిటైన్ చేసుకోకపోవడంపై ఆశ్చర్యం..
Uthappa

Updated on: Dec 02, 2021 | 11:51 AM

IPL 2022 మెగా వేలానికి ముందు 8 ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురిని రిటైన్ చేసుకుంది. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జేలను కొనసాగించింది. డీసీ రిటెన్షన్‎పై పలు విమర్శలు వస్తున్నాయి. మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్‎పై స్పందించాడు. ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను రిటైన్ చేసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “శిఖర్ ధావన్ ఢిల్లీ తరఫున బాగా ఆడాడు. కగిసో రబాడను రిటైన్ చేసుకుంటారని అనుకున్నా” అని స్టార్ స్పోర్ట్స్ షోలో ఉతప్ప అన్నాడు.

“కగిసో, అన్రిచ్ నార్ట్జే ఇద్దరూ ఉన్నట్లయితే ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్‌ బలంగా ఉంటుంది.” అని చెప్పాడు. ” ఢిల్లీకి పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఎంత బలమో మాకు తెలుసు, కాబట్టి వారు ఆ జంట నుండి ఒకరిని విడిచిపెట్టడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది” అని అతను చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గత మూడు సీజన్లలో వరుసగా ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది, 2020 ఎడిషన్‌లో వారు మొదటిసారిగా ఫైనల్‌కు చేరుకున్నారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం, ఎనిమిది ఫ్రాంచైజీలు గరిష్ఠంగా నలుగురిని తీసుకునే అవకాశం ఉంది. అందులో ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు ఉండవచ్చు. లేదా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు అన్‌క్యాప్‌డ్ భారతీయులు ఉండేలా ఎంపిక చేసుకోవాలి.

Read Also.. Virat Kohli ODI Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..