
ఇషాన్ కిషన్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించడం లేదు. కొన్ని తప్పుల కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్.. టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అలాగే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతన్ని తప్పించింది. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ఇషాన్.. ఐపీఎల్ 2025 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌పై ఇషాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే ఈ సీజన్‌లో ఎలాగైన దుమ్మురేపి.. టీమిండియాలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటికే అద్భుతంగా ఉన్న సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ఇషాన్ రాకతో మరింత దుర్బేధ్యంగా మారింది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్ జోడీ ఉంది. మిడిల్డార్‌లో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి సాలిడ్ బ్యాటర్లు ఉన్నారు. ఇక ఎంతో కీలకమైన వన్ డౌన్(మూడో స్థానం)లో ఇషాన్ కిషన్ రానున్నాడు. దీంతో ఒక్కసారిగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ అరివీర భయంకరంగా మారిపోయింది.
చాలా కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కదా.. మరి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడో అనే డౌట్ ఉంది. కానీ, ఐపీఎల్ 18వ సీజన్‌కి ముందే ఎస్‌ఆర్‌హెచ్ ఇంట్రా స్క్వౌడ్ మ్యాచ్‌ను నిర్వహించింది. జట్టులో ఉన్న ప్లేయర్లతో రెండు టీమ్‌లు చేసి, ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఆడించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. కేవలం 23 బంతుల్లోనే 64 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే.. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగులేదని అంతా భావిస్తున్నారు.
High and handsome from Ishan Kishan 😱
Watch him bat LIVE here 👇https://t.co/wHZFeh2wLU#PlayWithFire pic.twitter.com/LK7a7t8cbx
— SunRisers Hyderabad (@SunRisers) March 15, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.