Ishan Kishan: ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో ఎంపికైన వెంటనే తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థల పాలిట విలన్‌లా మారాడు. బుచ్చి బాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్‌కు కెప్టెన్‌గా ఉన్న ఇషాన్.. వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు 3 అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. శంకర్ నగర్‌లోని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ క్రికెట్ గ్రౌండ్‌లో జార్ఖండ్, మధ్యప్రదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ ఇషాన్ జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన 15వ ఓవర్‌లో అతను ఎడమవైపు ఫార్వర్డ్ క్యాచ్ అందుకుని షాక్ ఇచ్చాడు.
ఎంపీ బ్యాట్స్‌మెన్ చంచల్ రాథోడ్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌కు తగిలి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. ఇషాన్ క్యాచ్ పట్టడంతో చంచల్ తిరిగి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
Our kaptaan sahab took 3 superb catches today & JK bowlers conceeded only 225 runs in 90 overs with 8 wickets 😎💯#BuchiBabuTournament pic.twitter.com/kdXLvhuT1k
— RS (@vividrs18) August 15, 2024
ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ ప్రమాదకరమైన శుభమ్ ఎస్ కుష్‌వాహా వికెట్ పడగొట్టాడు. శుభమ్ 171 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 84 పరుగులు చేశాడు. కుష్వాహ స్క్వేర్ కట్ కోసం వెళ్లాడు. కానీ, బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బంతి కిషన్ గ్లోవ్స్‌లోకి వెళ్లింది.
కిషన్ సహకారంతో మధ్యప్రదేశ్ 89.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. జార్ఖండ్ తరపున శుభమ్‌సింగ్, సౌరభ్ శేఖర్, వివేకానంద్ తివారీ, ఆదిత్య సింగ్ తలో రెండు వికెట్లు తీశారు.
కిషన్ విషయానికి వస్తే, అతను ఈ సంవత్సరం ప్రారంభంలో శ్రేయాస్ అయ్యర్‌తో పాటు BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించబడ్డాడు. బోర్డు, సెక్రెటరీ జై షా నుంచి సూచనలు చేసినా.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడలేదు.
నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన T-20లో కిషన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. అతని చివరి రెడ్ బాల్ మ్యాచ్ కూడా గతేడాది జులైలో భారత్ తరఫున జరిగింది. అతను జులై 20న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో టెస్టు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..