IPL 2022: ఐపీఎల్‌ కొత్త ఛాంపియన్‌గా గుజరాత్.. ఇప్పటి వరకు ట్రోఫీ గెలిచిన, గెలవని టీంలు ఇవే..

Gujarat Titans New IPL Champion: హార్దిక్ పాండ్యా బలమైన ప్రదర్శన కారణంగా, గుజరాత్ టైటాన్స్ IPL 2022 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, రోహిత్ తర్వాత టైటిల్ గెలిచిన నాలుగో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.

IPL 2022: ఐపీఎల్‌ కొత్త ఛాంపియన్‌గా గుజరాత్.. ఇప్పటి వరకు ట్రోఫీ గెలిచిన, గెలవని టీంలు ఇవే..
Gujarat Titans

Updated on: May 30, 2022 | 6:15 AM

స్థానిక కుర్రాడు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా బలమైన ఆట కారణంగా ఐపీఎల్ 2022 (IPL 2022) టైటిల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ కల చెదిరిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తర్వాత తొలిసారి ఐపీఎల్ లీగ్‌లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది. అయితే, గుజరాత్ కంటే ముందు ఏటీం ఎన్ని సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిందో చూద్దాం..

ఎవరు ఎప్పుడు ఛాంపియన్ అయ్యారంటే?

రాజస్థాన్ రాయల్స్: 2008

ముంబై ఇండియన్స్: 2013, 2015, 2017, 2019, 2020

చెన్నై సూపర్ కింగ్స్: 2010, 2011, 2018, 2021

కోల్‌కతా నైట్ రైడర్స్: 2012, 2014

సన్‌రైజర్స్ హైదరాబాద్: 2016

ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని టీంలు..

ఢిల్లీ క్యాపిటల్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

పంజాబ్ కింగ్స్

లక్నో సూపర్ జెయింట్స్ (2022లో వచ్చిన కొత్త టీం)