IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి రెండు కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రాణాళికలు చేస్తోంది. ఈ వ్యవహారాన్ని త్వరగా పూర్తిచేసే దిశగా ముందుకుసాగుతోంది. జులైలోనే ఈ ప్రక్రియ ముగించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమేరకు ఒక్కో ఫ్రాంచైజీ విలువ చూస్తే అమ్మో అనేలా ఉందని తెలుస్తోంది. ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కాస్ట్‌లీ లీగ్ గా ఐపీఎల్ పేరుగాంచింది. ప్రతి ఏటా ఐపీఎల్ విలువ పెరుగుతూనే పోతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. రానున్న ఐపీఎల్‌లో 10 జట్లను పెంచేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఐపీఎల్ పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈమేరకు కొత్త ఫ్రాంచైజీలకు భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ధర ఎంతైనా కొనేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపిస్తుండడంతో బీసీసీఐ భారీ ధర నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు బిడ్లు ఆహ్వానించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
‘జులైలో టెండర్లు పిలుస్తారని సమాచారం ఉంది. చాన్నాళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. అయితే నూతన ఫ్రాంచైజీ ధర 250 మిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉందని’ ఓ వ్యాపార సంస్థ సీఈవో పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఈ మధ్యే తమ ఫ్రాంచైజీలో కొంత వాటాను విక్రయించింది. ఆ వాటా విలువ రూ.1855 కోట్లు ఉందని తెలిసింది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ రూ.2200-2500 కోట్లుగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. వీటితో పాటు కోల్‌కతా, బెంగళూరు ఫ్రాంచైజీల విలువ కూడా భారీగానే ఉండనుంది. అన్నింటి కన్నా ముంబయి ఇండియన్స్ విలువ రూ.2700-2800 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ వేలం 2022లో జరగనుంది. ఫ్రాంచైజీలతోపాటు ఐపీఎల్ ప్రసార హక్కులు ఆకాశాన్ని అంటనున్నాయి.
కాగా, విలువ కనీసం సెప్టెంబరు 18 లేదా 19 నుంచి టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అక్టోబరు 9 లేదా 10న ఫైనల్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో భారత్‌లో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే ఇక్కడే జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కూడా యూఏఈ కి తరలిపోయింది.
Also Read:
ఇంగ్లండ్ వీధుల్లో టీమిండియా ఉమెన్స్.. ఆటలోనే కాదు అందంలోనూ పోటీపడుతోన్న మిథాలీ సేన!
IND vs ENG 2021: ఇదే టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ జోడీ: ఆకాశ్ చోప్రా
T20 World Cup: యూఏఈలో పొట్టి ప్రపంచకప్.. పాకిస్థాన్ కే అవకాశాలు ఎక్కువ: కమ్రాన్ అక్మల్