IPL Media Rights: కళ్లు చెదిరే ధర పలికిన ఐపీఎల్‌ ప్రసార హక్కులు.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 100 కోట్ల పైమాటే..

|

Jun 13, 2022 | 3:51 PM

IPL Media Rights: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రసార హక్కులకు కళ్లు చెదిరే ధర పలికింది. డిజిటల్‌, టీవీ హక్కులు కలిసి రూ. 44,075 కోట్లకు ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. సోనీ, జియోలు...

IPL Media Rights: కళ్లు చెదిరే ధర పలికిన ఐపీఎల్‌ ప్రసార హక్కులు.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 100 కోట్ల పైమాటే..
Ipl Media Rights
Follow us on

IPL Media Rights: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రసార హక్కులకు కళ్లు చెదిరే ధర పలికింది. డిజిటల్‌, టీవీ హక్కులు కలిసి రూ. 44,075 కోట్లకు ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. సోనీ, జియోలు (వయాకామ్ 18) ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నాయి. ఇందులో సోనీ చేసిన ఖర్చు రూ. 23,575 కోట్లు. ఐపీఎల్ డిజిటల్‌ హక్కులను రియలయన్స్‌ జియో దక్కించుకుంది.

5 ఏళ్ల పాటు సోనీ, జియో సంస్థలు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నాయి . 2023 నుంచి 2028 వరకు ఈ రెండు బ్రాడ్‌కాస్ట్‌లు ఐపీఎల్‌ను ప్రసారం చేయనున్నాయి. ప్రతి మ్యాచ్‌కు రూ. 100 కోట్లు దాటిన ప్రసార హక్కులు. ప్రతి మ్యాచ్‌కు టీవీ ప్రసార హక్కులు రూ. 57.5 కోట్లు కాగా, డిజిటల్‌ హక్కులు రూ. 50 కోట్లుగా పలికింది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రేంజ్‌లో ప్రసార హక్కులు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. అయితే తొలుత నిపుణులు రూ. 50 వేల కోట్ల మార్క్‌ను దాటుతాయని అంచనా వేసిన కాస్త దూరంలో ఆగిపోయాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..