SRH vs RR IPL Match Result: సొంతమైదానంలో హైదరాబాద్ ఘోర పరాజయం.. తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన శాంసన్ సేన..

|

Apr 02, 2023 | 7:32 PM

ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

SRH vs RR IPL Match Result: సొంతమైదానంలో హైదరాబాద్ ఘోర పరాజయం.. తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన శాంసన్ సేన..
Srh Vd Rr Result
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జట్టు 10వ సారి 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును కాపాడుకుంది.

హైదరాబాద్‌పై రాజస్థాన్‌కు ఇది 9వ విజయం. ఇరు జట్లు 17 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. హైదరాబాద్‌ కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..