ఐపీఎల్(IPL 2022)లో ఈరోజు డబుల్ హెడర్‌లో భాగంగా, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్(CSK vs SRH) తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ టీం.. 17.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేన్ విలియమ్సన్(32 పరుగులు, 40 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో హైదరాబాద్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి(39 పరుగులు, 15 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు, 260 స్ట్రైక్ రేట్) కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2022లో హైదరాబాద్ టీం తొలి విజయాన్ని నమోదు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ టీం మాత్రం వరుసగా నాలుగోసారి ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లో బ్రావో, ముఖేష్ చౌదరి తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు చెన్నై టీంలో మొయిన్ అలీ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాయుడు 27, జడేజా 23 పరుగులు చేశారు. మిగతా వారంతా మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక బౌలింగ్‌లో నటరాజన్, సుందర్ తలో రెండు వికెట్లు, భువనేశ్వర్, జాన్సన్, ఐడెన్ మార్కాం తలో వికెట్ పడగొట్టారు. SRH బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ మరోసారి రెండు వికెట్లు తీశాడు. రాబిన్ ఉతప్ప (15), అంబటి రాయుడు (27)లను అవుట్ చేశాడు. ఉతప్ప, రాయుడు ఐడెన్ మార్క్రామ్‌కి క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుత టోర్నీలో సుందర్ 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
.@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v
— IndianPremierLeague (@IPL) April 9, 2022
Also Read: RCB vs MI Live Score, IPL 2022: ముంబై విజయాల ఖాతా తెరిచేనా? టాస్ గెలిచిన బెంగళూరు..