IPL 2021, SRH vs RR: ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. హైదరాబాద్ తరపున కేన్ విలియమ్సన్ (51), జాన్సన్ రాయ్ (60)పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు.
165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు జాన్సన్ రాయ్, సాహా అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో గెలుపుపై ఆశలు పెంచుకుంది. అనంతరం 5.1 ఓవర్లో సాహా లామ్రోర్ బౌలింగ్‌లో కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత జాన్సన్ రాయ్ 4వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది బౌలర్ ముస్తఫిజుర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు పిండుకున్నాడు. అలాగే 5 ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు బాది బౌలర్ క్రిస్ మోరిస్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు పిండుకున్నాడు. ఇలా ప్రతీ ఓవర్‌లో బౌండరీల మోత మోగించి టీం ను విజయానికి దగ్గరికి చేర్చాడు. 11.6 ఓవర్లో జాన్సన్ రాయ్ (60 పరుగులు, 42 బంతులు, 8 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియం గ్రాగ్ వెంటనే పెవిలియన్ చేరాడు.
అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ టీం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51 పరుగులు, 41 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ(21 పరుగులు, 16 బంతులు, 1 ఫోర్, 1సిక్స్) కీలక భాగస్వామ్యాన్ని అందించి విజయానికి మిరింత దగ్గరగా చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో రహమాన్, లామ్రోర్, చేతన్ సకారియా తలో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈవిన్ లీవిస్ (6) రూపంలో తొలి వికెట్‌ను తర్వగా కోల్పోయిన రాజస్థాన్ టీం.. జైస్వాల్, శాంసన్ సమయానుకూలంగా ఆడుతూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును పెంచేందుకు సహాయపడ్డారు. దూకుడు మీదున్న జైస్వాల్(36 పరుగులు, 23 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్)ను సందీప్ శర్మ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ (4) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మరోసారి మహిపాల్ లామ్రోర్(29)తో కీలకమైన భాగస్వామ్యాన్ని శాంసన్ నెలకొల్పాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కేవలం 57 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు సాధించి, హైదరాబాద్ ముందు భారీ స్కోర్ ఉంచేందుకు సహాయపడ్డాడు. 143 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో సిద్ధార్ధ్ కౌల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో కౌల్ 2 వికెట్లు, సందీస్ శర్మ, భువనేశ్వర్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
8⃣ fours, 1⃣ six & 6⃣0⃣ off 4⃣2⃣ balls! ? ?@JasonRoy20 went berserk ⚡️ with the bat on his @SunRisers debut and made a match-winning contribution. ? ? #VIVOIPL #SRHvRR
Watch his knock ? ?https://t.co/oJd3UUXHJt
— IndianPremierLeague (@IPL) September 27, 2021
???#SRHvRR #VIVOIPL https://t.co/TN3tS5tx56 pic.twitter.com/ZiKBBT1MuW
— IndianPremierLeague (@IPL) September 27, 2021
Also Read: IPL 2021, SRH vs RR: హైదరాబాద్ టార్గెట్ 165.. 143 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ చేసిన శాంసన్
15 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ.. బౌలర్లపై బౌండరీలతో దాడి.. అమెరికాలో అలజడి రేపిన ఇండియన్ ప్లేయర్