IPL 2021: ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండవ మ్యాచ్ షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం అన్ని విభాగాల్లో ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్లేఆఫ్‌లో నిలిచింది. 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ప్లేఆఫ్‌లో 4 వ జట్టుగా చేరినట్లే. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచలో 250+ స్కోర్ చేసిన తర్వాత 170+ పరుగులతో హైదరాబాద్ టీంను ఓడించాలి. అయినా నెట్ రన్‌రేట్‌లో మాత్రం బీట్ చేయలేదు. దీంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కేవలం 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుత్ తెవాటియా ఒక్కడే 44 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అలాగే శివం దుబే 18 పరుగులు చేసి రెండో అత్యధిక స్కోరర్‌గా మిగిలాడు. మిగిలిన వారంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జైస్వాల్ 0, లివింగ్ స్టోన్ 6, శాంసన్ 1, రావత్ 0, గ్లెన్ పిలిప్స్ 8, క్రిస్ మోరీస్ 0, జయంత్ ఉనద్కత్ 6, చేతన్ సకారియా 1 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో శివం మావి 4 వికెట్లు, ఫెర్గ్యూసన్ తలో 3 వికెట్లు, షకిబుల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడిన కోల్‌కతా టీం నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్‌లు మంచి ఓపెనింగ్ భ్యాగస్వామ్యాన్ని అందించారు. చూడచక్కని బౌండరీలతో అలరించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాని అందించారు. 10.5 ఓవర్లో రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్(38 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) బౌల్డయి, తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష రానా(12 పరుగులు, 5 బంతులు, 1 ఫోర్ల, 1 సిక్స్) 240 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి బౌలర్లపై ఆధిపత్యం చూపించేందుకు సిద్ధమయ్యాడు. కానీ, తాను ఆడిన 5 వ బంతికే భారీ షాట్ ఆడే క్రమంలో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన త్రిపాఠితో కలిసి ఓపెనర్ శుభ్మన్ గిల్ ధాటిగా పరుగులు సాధించారు. టీం స్కోర్‌ను వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలోనే గిల్ తన హాప్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే గిల్(56 పరుగులు, 44 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) క్రిస్ మోరిస్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. గిల్ పెవిలియన్ చేరిన వెంటనే రాహుల్ త్రిపాఠి(21 పరుగులు, 14 బంతులు, 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. దినేష్ కార్తిక్, కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ పరుగులతో నిలిచి మరో వికెట్ పడకుంగా జగ్రత్త పడ్డారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ పిలిప్స్ తలో వికెట్ పడేశారు.
THAT. WINNING. FEELING! ? ?
The @Eoin16-led @KKRiders put up a clinical performance & seal a 86-run win over #RR. ? ? #VIVOIPL #KKRvRR
Scorecard ? https://t.co/oqG5Yj3afs pic.twitter.com/p5gz03uMbJ
— IndianPremierLeague (@IPL) October 7, 2021
Also Read: Harbhajan Singh: టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఆ ఆటగాడికి స్థానం కల్పించాలి.. హర్భజన్ సింగ్ ట్విట్
IPL 2021, CSK vs PBKS: మైదానంలో చెన్నై ఆటగాడి లవ్ ట్రాక్.. వైరల్‌గా మారిన ప్రపోజ్ వీడియో