IPL 2024 Purse Remaining: చెన్నై నుంచి ముంబై వరకు.. ట్రేడింగ్ తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలి ఉందంటే.. టాప్ టీం ఏదంటే?

|

Nov 26, 2023 | 10:24 PM

IPL 2024: ఐపీఎల్ జట్లు చాలా మంది పెద్ద ఆటగాళ్లను విడుదల చేశాయి. ఇప్పుడు ఈ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో భాగం కానున్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగాల్సి ఉండగా, ఏ జట్టుకు ఎంత పర్సు మిగిలిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. ఇందులో జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్ ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత, RCB వద్ద రూ. 40.75 కోట్ల పర్స్ ఉంది.

IPL 2024 Purse Remaining: చెన్నై నుంచి ముంబై వరకు.. ట్రేడింగ్ తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలి ఉందంటే.. టాప్ టీం ఏదంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు IPL వేలంలో మొదటిసారి నామినేట్ కానున్నారు. అయితే, కొంతమంది లెజెండ్‌లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ రిచ్ లీగ్‌లోకి తిరిగి రానున్నారు. IPL 2024 వేలానికి ముందు, రాబోయే వేలంలో IPL అత్యధిక బిడ్ పొందే ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
Follow us on

IPL Auction 2024: ఈ రోజు IPL జట్లు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల తుది జాబితాను BCCIకి సమర్పించాయి. ఈ క్రమంలో మొత్తం 10 ఐపీఎల్ జట్లు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి అందిచండంలో అన్ని జట్ల ఖాళీలు తెలిశాయి. ఐపీఎల్ జట్లు చాలా మంది పెద్ద ఆటగాళ్లను విడుదల చేశాయి. ఇప్పుడు ఈ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో భాగం కానున్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగాల్సి ఉండగా, ఏ జట్టుకు ఎంత పర్సు మిగిలిందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధిక పర్స్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. ఇందులో జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్ ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత, RCB వద్ద రూ. 40.75 కోట్ల పర్స్ ఉంది. ఇది ఇతర జట్ల పర్స్ కంటే చాలా ఎక్కువ. అదే సమయంలో, దీని తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద 34 కోట్ల రూపాయల పర్స్ ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 32.7 కోట్ల రూపాయలతో వేలంలోకి ప్రవేశించనుంది.

ఇతర జట్ల వద్ద ఎంత పర్సు ఉందంటే?

రిటెన్షన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పర్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ వద్ద వరుసగా రూ. 31.4 కోట్లు, రూ. 29.1 కోట్లు, రూ. 28.95 కోట్లు, రూ. 15.25 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఇది కాకుండా, రాజస్థాన్ రాయల్స్ పర్స్ 14.5 కోట్ల రూపాయలుగా నిలిచింది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా రూ. 13.9 కోట్లు, రూ. 13.85 కోట్ల పర్స్ కలిగి ఉన్నాయి. ఐపీఎల్ వేలం 2024 డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగడం గమనార్హం. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్ల కోసం జట్లు రంగంలోకి దిగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..