ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే?

IPL 2027 Retention: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు ప్రకటించాయి. పర్స్ పెంచుకునే క్రమంలో ట్రావిస్ హెడ్, హార్దిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లను వదులుకున్నాయి. ఆ నాలుగు తప్పిదాలు ఏంటో, ఏ జట్టు పశ్చాత్తాపపడుతుందో ఇప్పుడు చూద్దాం. వేలంలో వారి కోసం భారీ పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతం.

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే?
Ipl 2027 Retention (1)

Updated on: Nov 20, 2026 | 10:04 PM

IPL 2027 Retention: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను విడుదల చేసి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాయి. పర్స్ బ్యాలెన్స్ పెంచుకోవడం, కొత్త కాంబినేషన్ ఏర్పాటు చేసుకోవడం కోసం చాలా జట్లు నమ్మకమైన మ్యాచ్ విన్నర్లను వదులుకున్నాయి. కొందరిని నేరుగా వేలంలోకి పంపగా, మరికొందరిని ట్రేడ్ ద్వారా ఇతర జట్లకు ఇచ్చేశాయి. వదులుకోకూడని నలుగురు స్టార్ల గురించి చూద్దాం.

1. ట్రావిస్ హెడ్ – సన్‌రైజర్స్ హైదరాబాద్..

రూ.14 కోట్ల పర్స్ ఖాళీ చేయడం కోసం SRH విధ్వంసక ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను IPL 2027కు ముందు రిలీజ్ చేసింది. గత కొన్ని సీజన్లుగా హైదరాబాద్ దూకుడు బ్యాటింగ్‌కు హెడ్ ప్రాణం. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లను చీల్చి జట్టుకు ఏకపక్ష విజయాలు అందించాడు.

ఇంతటి మ్యాచ్ విన్నర్‌ను వేలంలోకి వదలడం SRHకు పెద్ద రిస్క్. అతడి వంటి భయంలేని ఓపెనర్ కోసం వేలంలో చాలా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో అతడి లోటు హైదరాబాద్‌కు తప్పకుండా తెలుస్తుంది.

2. హార్దిక్ పాండ్యా – ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ

IPL 2027కు ముందు అత్యంత షాకింగ్ నిర్ణయం ముంబై ఇండియన్స్ తీసుకుంది. కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసింది. భారత అత్యుత్తమ పేస్ ఆల్‌రౌండర్‌ను వదులుకోవడం ముంబై బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది.

హార్దిక్ లోయర్ ఆర్డర్‌లో 146కు పైగా స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించడంతో పాటు మిడిల్, డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీస్తాడు. పంజాబ్‌కు కెప్టెన్సీ మెటీరియల్ ఉన్న మ్యాచ్ విన్నర్ దొరకగా, ముంబైకి అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టం.

3 & 4. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ – చెన్నై సూపర్ కింగ్స్

లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను తీసుకోవడం కోసం సీఎస్కే తన ఇద్దరు కీలక పేసర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌ను SRHకు ట్రేడ్ చేసింది.

ఖలీల్ అహ్మద్ కొత్త బంతితో పవర్‌ప్లేలో స్వింగ్‌తో ప్రారంభ దెబ్బలు వేసే భారత లెఫ్టార్మ్ పేసర్. రూ.4.8 కోట్లకు అతడు చాలా తక్కువ ధరకే లభించాడు.

ఆసీస్‌కు చెందిన నాథన్ ఎల్లిస్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. స్లో బాల్స్, కచ్చితమైన యార్కర్లతో పిచ్‌పై రాణించాడు. ఐపీఎల్ 2027లో ఇద్దరు బౌలర్లను ఒక్కసారి వదులుకోవడం CSK బౌలింగ్‌ను బలహీనపరుస్తుంది. ఈ నలుగురి విషయంలో ఫ్రాంచైజీలు తీసుకున్న నిర్ణయం రాబోయే సీజన్‌లో భారీ మూల్యం చెల్లించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us