IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!

IPL 2027 Auction 30 Lakh Players: డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలంలో 1220 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. అందులో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన ఈ 5 యువ భారత ప్లేయర్లకు బిడ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
Ipl 2027 Auction 30 Lakh Players

Updated on: Nov 28, 2026 | 1:16 PM

IPL 2027 Auction: ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో మెరవాలని ఎదురుచూస్తున్న యువ భారత క్రికెటర్లకు ఐపీఎల్ 2027 మినీ వేలం మంచి ఛాన్స్ ఇవ్వనుంది. ఐటీసీ గ్రాండ్ గోవాలో డిసెంబర్ 16, 2026 ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభం కానుంది. మొత్తం 1220 మంది ప్లేయర్లు నమోదు చేసుకోగా.. అందులో 939 మంది భారతీయులు, 281 మంది విదేశీయులు ఉన్నారు. పది జట్లలో కలిపి 66 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగి ఫ్రాంచైజీలను ఆకర్షించే 5గురు కుర్రాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆర్యవీర్ సెహ్వాగ్.. సెహ్వాగ్ వారసుడిపై కోట్ల వర్షం..!

వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై ఫ్రాంచైజీలు కన్నేసినట్లు తెలుస్తోంది. 2026 అండర్-19 ఆసియా కప్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. 5 ఇన్నింగ్స్‌లలో 90.25 సగటు, 95.50 స్ట్రయిక్ రేట్‌తో 361 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అండర్-19 వన్డేల్లోనూ 6 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 240 పరుగులు చేశాడు. భారీ స్కోర్లు చేసే సత్తా ఉన్నందున రూ.30 లక్షలకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా జట్లు భావిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

ఇవి కూడా చదవండి

2. యశ్ ధుల్.. 59 బంతుల్లో 125.. ఫామ్ మామూలుగా లేదుగా..!

మాజీ అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. 24 ఏళ్ల ఈ బ్యాటర్ 2026-27 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 53.16 సగటు, 181.25 స్ట్రయిక్ రేట్‌తో 319 పరుగులు చేశాడు. అందులో బిహార్‌పై 59 బంతుల్లోనే 125 నాటౌట్, పంజాబ్‌పై 40 బంతుల్లో 78 నాటౌట్ ఉన్నాయి. 2026 DPL సీజన్‌లోనూ 9 ఇన్నింగ్స్‌లలో 214 స్ట్రయిక్ రేట్‌తో 410 పరుగులు చేశాడు. నమ్మకమైన భారత బ్యాటర్ కోసం వెతికే జట్లకు ధుల్ బెస్ట్ ఆప్షన్.

3. ఉదయ్ సహరాన్.. మిడిల్ ఆర్డర్ హిట్టర్..!

మరో మాజీ అండర్-19 కెప్టెన్ ఉదయ్ సహరాన్ టీ20లో మెరుగయ్యాడు. 2026-27 SMATలో 7 ఇన్నింగ్స్‌లలో 174.59 స్ట్రయిక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 70.20 సగటు, 192.86 స్ట్రయిక్ రేట్‌తో 351 పరుగులు బాదాడు. అగ్రెసివ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా.. పైగా వివిధ పొజిషన్లలో ఆడగలగడం, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ వేయగలగడం అతడికి ప్లస్.

4. తుషార్ రహేజా.. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్..!

వికెట్ కీపర్-బ్యాటర్ కోసం చూసే జట్లకు తమిళనాడుకు చెందిన తుషార్ రహేజా మంచి ఆప్షన్. 25 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ TNPL 2026లో 8 ఇన్నింగ్స్‌లలో 70.33 సగటు, 190.09 స్ట్రయిక్ రేట్‌తో 422 పరుగులు చేసి అదరగొట్టాడు. పవర్‌ప్లేలో వేగంగా ఆడటం అతడి స్ట్రెంత్. పైగా కీపింగ్ ఆప్షన్ ఉండటంతో బిడ్ దక్కడం ఖాయమంటున్నారు.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

5. మోహిత్ ఉల్వా.. నం.10లో వచ్చి మ్యాచ్ గెలిపించినోడు..!

బడ్జెట్‌లో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం చూసే జట్లకు మోహిత్ ఉల్వా దొరకొచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2026 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లోనే 188.46 స్ట్రయిక్ రేట్‌తో 49 నాటౌట్ చేసి చివరి బంతికి విన్నింగ్ బౌండరీ కొట్టి ఒక్క వికెట్ తేడాతో భారత్‌ను గెలిపించాడు.

మొత్తంగా చూస్తే.. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన ఈ యువ ప్లేయర్లు తక్కువ ధరకే దొరికే స్టార్లు. మరి డిసెంబర్ 16న వీరి కోసం ఏ జట్టు ఎన్ని కోట్లు కుమ్మరిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us