MI vs KKR IPL 2026 Result: 14 ఏళ్ల తొలి గండాన్ని ఛేదించిన ముంబై.. కేకేఆర్‌పై ఘన విజయం..

Mumbai Indians vs Kolkata Knight Riders Result, IPL 2026: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ టీం తన 14 ఏళ్ల తొలి గండాన్ని బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయే అలవాటును బ్రేక్ చేసింది. రోహిత్, రికెల్టన్‌ల ఊచకోతతో ఘన విజయం సాధించింది.

MI vs KKR IPL 2026 Result: 14 ఏళ్ల తొలి గండాన్ని ఛేదించిన ముంబై.. కేకేఆర్‌పై ఘన విజయం..
Mi Vs Kkr Result

Updated on: Mar 29, 2026 | 11:12 PM

Mumbai Indians vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ రెండవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. గత 14 ఏళ్లుగా తొలి మ్యాచ్ లో పరాజయం పాలవుతోన్న రికార్డ్ ను 2026లో బ్రేక్ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ రికార్డ్ టార్గెట్ ఛేజ్ చేసి సరికొత్త లెక్కలు సెట్ చేసింది. కేకేఆర్ అందించిన 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేజ్ చేసింది. రోహిత్, రికెల్టన్ 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ ఛేజ్ ను వన్ సైడ్ చేశారు.

రోహిత్ 23 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేయగా, రికెల్టన్ కేవలం 24 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని సాధించాడు. అనంతరం 12వ ఓవర్‌లో ముంబై తమ మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ ఓవర్‌లోని ఐదవ బంతికి వైభవ్ అరోరా బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఒక భారీ షాట్ ఆడాడు. ఆ బంతి గాల్లోకి గాల్లోకి మిడ్-వికెట్ వైపు దూసుకెళ్లింది. షార్ట్ మిడ్-వికెట్ నుంచి వెనక్కి పరుగెత్తుకొచ్చిన అనుకుల్ రాయ్ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రోహిత్ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 67 పరుగులు, అంగక్రిష్ రఘువంశీ 51 పరుగులు చేశారు. ముంబై తరపున శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కాగా, అజింక్య రహానే గాయంతో మైదానం వీడగా, అతని స్థానంలో రింకు సింగ్ కెప్టెన్సీ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us