కావ్యపాప కాసుల వర్షం.. కట్‌చేస్తే.. 38 బంతుల్లో కాటేరమ్మ నయా కొడుకు బీభత్సం.. మాటల్లేవంతే

Sharjah Warriorz vs Abu Dhabi Knight Riders: ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అదే రోజు రాత్రి, లియామ్ లివింగ్‌స్టన్ 48 బంతుల్లో 76 పరుగులతో చెలరేగాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో అబుదాబి నైట్ రైడర్స్ జట్టు డెజర్ట్ వైపర్స్‌పై కేవలం ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

కావ్యపాప కాసుల వర్షం.. కట్‌చేస్తే.. 38 బంతుల్లో కాటేరమ్మ నయా కొడుకు బీభత్సం.. మాటల్లేవంతే
Liam Livingstone

Updated on: Dec 17, 2025 | 1:38 PM

Sharjah Warriorz vs Abu Dhabi Knight Riders: ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో అబుదాబి నైట్ రైడర్స్ (ADKR) జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో డెజర్ట్ వైపర్స్‌పై కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించి, ఆ జట్టు విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఈ విజయంతో నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

లివింగ్‌స్టన్ మెరుపు ఇన్నింగ్స్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్ రైడర్స్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును లియామ్ లివింగ్‌స్టన్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 76 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అతనికి అలీషాన్ షరాఫు (39), చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24*) చక్కటి సహకారం అందించడంతో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

పోరాడి ఓడిన డెజర్ట్ వైపర్స్..

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్‌కు ఓపెనర్లు ఫఖర్ జమాన్ (44), మాక్స్ హోల్డెన్ (52) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 53 పరుగులు చేశారు. ఒక దశలో వైపర్స్ విజయం ఖాయమనిపించినా, ఆండ్రీ రస్సెల్ (2/16) వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సునీల్ నరైన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాడు.

చివరి ఓవర్ డ్రామా..

చివరి 12 బంతుల్లో 19 పరుగులు అవసరం కాగా, మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా, బౌలర్ అజయ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి నైట్ రైడర్స్‌కు 1 పరుగు తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వైపర్స్ 20 ఓవర్లలో 180/6 పరుగులకే పరిమితమైంది.

అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న లియామ్ లివింగ్‌స్టన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా, “ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అదే రోజు రాత్రి, లియామ్ లివింగ్‌స్టన్ 48 బంతుల్లో 76 పరుగులతో చెలరేగాడు. ఇదే ఫాంతో ఐపీఎల్ 2026లోనూ చెలరేగి హైదరాబాద్ జట్టును విజేతగా చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.